Somu Veeraju: ఏపీ సీఎం జగన్ ను అడ్డంగా బుక్ చేశారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఉత్తరాంద్ర వెనుకబాటుపై కడిగేశారు. జగన్ ఇచ్చిన హామీలను గుర్తు చేసి మరీ ఎండగట్టారు. ఉత్తరాంధ్రలో ఎటు చూసినా నిర్మాణం పూర్తికాని మొండిగోడలు,చుక్కనీరు లేని కాల్వల వ్యవస్థ, ప్రాజెక్టు ప్రధాన కాల్వల వద్ద గ్రోయిన్స్ నిర్మాణం కాక సాగునీటి కోసం ఉత్తరాంధ్ర రైతులు పడుతున్న ఆవేదనకు అక్షర రూపం ఇచ్చారు. ఈ మేరకు వైఎస్ జగన్ కు ఉత్తరాంధ్రకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని నిరసిస్తూ ఒక ఘాటు లేఖ రాశారు. అది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఒక రూట్ మ్యాప్ ప్రకటించాలని బహిరంగ లేఖ ద్వారా సోము వీర్రాజు డిమాండ్ చేశారు. దశాబ్ధాల తరబడి పెండింగ్ ప్రాజెక్టుల మాట దేవుడు ఎరుగు.. కనీసం ఇప్పటి వరకూ వ్యయం చేసిన ప్రజాధనానికి ఎవరు సమాధానం చెబుతారని నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర విస్తీర్ణంలో 4వ వంతు ఉంటుందని.. అంతటి విస్తీర్ణం కలిగిన ఉత్తరాంధ్రకు సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్ లో పెట్టడానికి కారణం ఎవరు అని ప్రశ్నిస్తున్నారు.ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శించారు. ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టులకు ప్రభుత్వ పెద్దలే కారణమని ఆరోపించారు.
ఉత్తరాంధ్రకు కీలకమైన 19 టీఎంసీల వంశధార ప్రాజెక్టు ను పూర్తి చేయకుండా ప్రస్తుతం 9 టీఎంసీలకే పరిమితం చేశారని.. మరో 45 కోట్లు వ్యయం చేస్తే ప్రాజెక్టు పూర్తి చేయవచ్చని సోము వీర్రాజు దిశానిర్ధేశం చేశారు. ఉత్తరాంధ్రలో 50 సంవత్సరాల క్రితం మూడు ప్రాజెక్టులకు ప్రణాళికలు రూపొందిస్తే నేటికి ఆ ప్రాజెక్టులు కేవలం ఎన్నికల సమయంలో ఎజెండానే మారుతున్నాయి తప్ప ప్రాజెక్టులు పూర్తి కాలేదని అన్నారు.
ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఉత్తరాంధ్రకు ఇచ్చిన హామీ ఇప్పటివరకూ అమలు కాలేదని ఆయన మాట్లాడిన పాత వీడియో ను గుర్తు చేసి మరీ సోము వీర్రాజు కడిగేశారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు ఎందుకు ముఖం చూపించడం లేదని సోము వీర్రాజు సూటిగా ప్రశ్నించారు. వంశధార, నాగావళి నదులు.. నేరడి బ్యారేజ్, గుట్టా బ్యారేజ్, మహేంద్రతనయ పై రిజర్వాయర్, మేఘాద్రిగడ్డ వంటి వాటిపై ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వాలని సోము వీర్రాజు లేఖలో డిమాండ్ చేశారు.
జగన్ ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ.. సోము వీర్రాజు షేర్ చేసిన వీడియో ఇదీ