Homeఆంధ్రప్రదేశ్‌Targeting Pavan: పవన్ ను టార్గెట్ చేస్తున్న ‘సోము’.. కథ వేరేలా ఉంది?

Targeting Pavan: పవన్ ను టార్గెట్ చేస్తున్న ‘సోము’.. కథ వేరేలా ఉంది?

Targeting Pavan: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధానంగా ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా జనసేనాని తగిన సన్నహాలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాజయం నుంచి గుణపాఠం నేర్చుకొని పవన్ కల్యాణ్ పార్టీని గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

జనసైనికుల్లో జోష్ నింపేలా వరుసగా ప్రజా పోరాటాలను చేస్తూ పవన్ కల్యాణ్ దూకుడగా వెళుతున్నారు. ఏపీ రాజధాని అమరావతి, ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా, రోడ్ల సమస్యలపై జనసేన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను చేపడుతోంది. అంతకముందు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అకాల వర్షాలు, తుఫానులతో నష్టపోయిన బాధితులకు జనసేన అండగా నిలిచి పోరాటాలు చేసింది.

ఈక్రమంలోనే జనసేనకు ఏపీలో ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు పలుచోట్ల గెలిచి సత్తా చాటారు. దీంతో ప్రజలు జనసేనను ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టమవుతోంది. ఈమేరకు జనసేన సైతం ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టి ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇందులో భాగంగానే జనసేనాని ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులకు మద్దతు ప్రకటించారు. అయితే ఈ పరిణామం బీజేపీకి మింగుడు పడటం లేదు. పవన్ కల్యాణ్ తమతో పొత్తు పెట్టుకొని కేంద్రానికి వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడుతున్నారు.

పవన్ కల్యాణ్ కి ఒక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మాత్రమే కనబడుతుందా? ప్రస్తుత, గత ప్రభుత్వాలు అమ్మిన ఆస్తులు కనబడటం లేదా అని నిలదీశారు. గత వారమంతా ఇదే ఇష్యూపై బీజేపీలో చర్చ నడిచింది. తాజాగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ ఇన్ డైరెక్ట్ గా పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాటాలు చేయాలని సోము వీర్రాజు చెబుతూ తమకు ఫుల్ టీ కావాలని.. హాఫ్ టీ వద్దన్నారు. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్.. అందులో టీ ఉండదనే ఉద్దేశ్యంతో సోమువీర్రాజు చేసిన వాఖ్యలు  వైరల్ అవుతున్నాయి. బీజేపీ తమ మిత్రపక్షమైన జనసేనపై పదేపదే విమర్శలు చేయడం వెనుక సోము వీర్రాజు ఉద్దేశ్యం ఏంటో మాత్రం తెలియడం లేదు.

గత కొద్దిరోజులుగా జనసేన, బీజేపీ మధ్య లుకలుకలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆయా పార్టీలు మాత్రం తమ పొత్తు కొనసాగుతుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

అయితే సోము వీర్రాజు పదేపదే జనసేనను టార్గెట్ చేయడం వెనుక అసలు కథే వేరే ఉందనే అభిప్రాయం మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ విషయంలో జనసేనాని ఎలా రియాక్ట్ అవుతారో వేచిచూడాల్సిందే..!

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version