Telangana: తెలంగాణ అంటేనే అనేక సంప్రదాయాలకు పుట్టినల్లు లాంటిది. మనకు ఎక్కడా కనిపించని కొన్ని సాంప్రదాయాలు తెలంగాణలో కనిపిస్తుంటాయి. అందులోనూ ఉత్తర తెలంగాణలో ఇలాంటివి ఉంటాయి. ఆడపడుచులకు బియ్యం పోయడం దగ్గరి నుంచి మొదలు పెడితే.. మగ పిల్లలకు పంచెకట్టు దాకా ఎన్నో సాంప్రదాయాలు ఉంటాయి.
మొన్నటి వరకు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజమాబాద్ ఉమ్మడి జిల్లాలలో అన్నదమ్ములకు అక్కచెల్లెళ్లు కుడక, చెక్కర పోసుకోవడం నడిచింది. దాని తర్వాత వదిన, మరదళ్లు గాజులు పెట్టుకునే సాంప్రదాయాలు జోరుగా సాగాయి. ఎక్కడ చూసినా ఇవే కనిపించాయి. అయితే ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించినవే ఉన్నాయి.
మరి మాకేంటి అనుకున్నారో లేక.. మాకేం తక్కువ అనుకున్నారో ఏమో గానీ.. కొత్త సాంప్రదాయానికి తెర లేపారు ఉమ్మడి కరీంనగర్ వాసులు. అదే బావలకు బామ్మర్దులు శాలువలు కప్పడం. అయితే ఇక్కడే ఓ పెద్ద ట్విస్టు ఉందండోయ్. ఈ శాలువాలు కప్పే సమయంలో బట్టలకు బదులుగా మందు బాటిళ్లు, బీరు బాటిళ్లు పెడుతున్నారు.
Also Read: Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటి? కథేంటి?
బావ ఏది తాగితే అది.. ఎంత మంది బామ్మర్దులు ఉంటే అంతమంది మందు బాటిళ్లు పెడుతున్నారు. ఇంకేముంది బావలు మస్తు కుషీ అయితున్నారు. ఆడోళ్లదంటే బట్టలు, గాజులే వారికి సంబురం. కానీ మొగోళ్లకు మందు ఉంటేనే మజా కదా. అందుకే ఇలా మందు బాటిళ్లు పెడుతూ.. వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పెట్టే సరికి ఫుల్ వైరల్ అయితున్నయ్.
ఇలా ఒకరిని చూసి మరొకరు మందు బాటిళ్లను పెట్టడం దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం జోరుగా సాగుతోంది. అయితే ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం మాత్రం కాదు. అలాగని దీన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. వీటిని చూస్తుంటే ఏదో ఫేమస్ కావాలని ఇలా ఫొటోలకు, వీడియోలకు ఫోజులు ఇస్తూ మందు బాటిళ్లు పెడుతున్నట్టు అర్థమవుతోంది. కానీ ఒకరిద్దరు చేస్తే పర్వాలేదు.. చాలామంది ఇప్పుడు దీన్ని ట్రెండ్ చేసేస్తుండటమే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.
Also Read: Telangana: తెలంగాణలో కేంద్ర దర్యాప్తు బృందాలు..? ఆ నేతలపై ఫోకస్