https://oktelugu.com/

‘అదిరింది’ షోపై విరుచుకుపడుతున్న వైసీపీ నేతలు

‘నవ్వులు పోయి నువ్వులయితయి’ అన్న పెద్దొళ్ల సామెత మాట ఇప్పుడు నిజమవుతుంది. ప్రేక్షకులకు నవ్వులు పూయించడానికి చేస్తున్న కామెడీ షోలు వివాదాలకు వేదికగా మారుతున్నాయి. జీ తెలుగులో వస్తున్న ‘అదిరింది’లో ఇటీవల కామెడీ అర్టిస్టులు చేసిన ఇమిటేషన్‌ సీన్‌ రచ్చ రచ్చగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై ఈ వ్యాఖ్యలు ఉండడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఫైర్‌ అవుతున్నారు. Also Read: ‘తెలుగు’తోనే టీడీపీకి చెక్ పెట్టనున్న జగన్ సర్కార్? నాగబాబు జడ్జిమెంట్‌గా, శ్రీముఖి యాంకర్‌గా […]

Written By:
  • NARESH
  • , Updated On : October 9, 2020 10:05 am
    Follow us on

    ‘నవ్వులు పోయి నువ్వులయితయి’ అన్న పెద్దొళ్ల సామెత మాట ఇప్పుడు నిజమవుతుంది. ప్రేక్షకులకు నవ్వులు పూయించడానికి చేస్తున్న కామెడీ షోలు వివాదాలకు వేదికగా మారుతున్నాయి. జీ తెలుగులో వస్తున్న ‘అదిరింది’లో ఇటీవల కామెడీ అర్టిస్టులు చేసిన ఇమిటేషన్‌ సీన్‌ రచ్చ రచ్చగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై ఈ వ్యాఖ్యలు ఉండడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఫైర్‌ అవుతున్నారు.

    Also Read: ‘తెలుగు’తోనే టీడీపీకి చెక్ పెట్టనున్న జగన్ సర్కార్?

    నాగబాబు జడ్జిమెంట్‌గా, శ్రీముఖి యాంకర్‌గా జీ తెలుగులో ‘అదిరింది’ ప్రసారమవుతోంది. ఈ షోలో ఇటీవల కొందరు కామెడీ ఆర్టిస్టులు ఏపీ సీఎంపై ఇమిటేట్‌ చేశారు. ఈ సీన్‌పై నాగబాబు విరగబడి నవ్వాడు. ఈ క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షో మొత్తంలో నాగబాబును టార్గెట్‌ చేసి సోషల్‌ మీడియా వేదికగా యుద్ధం చేస్తున్నారు. నాగబాబునే కాకుండా మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఈ వివాదంలోకి తీసుకురావడంతో అటు మెగా ఫ్యాన్స్‌ ప్రతికామెంట్లు పెడుతున్నారు.

    అయితే కామెడీ షోల్లో ఇలాంటి ఇమిటేట్లు కొత్తేమీ కాదు. ఎన్నికల ముందు చంద్రబాబు ఫ్యామిలీపై జగన్‌ వర్గం ఎన్నో ఇమిటేట్లు చేసింది. రామ్‌గోపాల్‌ వర్మ సహాయంతో ఏకంగా ఓ సినిమానే తీయించింది. అయితే దాన్ని ఉటంకిస్తూ పవన్‌ ఫ్యాన్స్‌ ఇప్పుడు జగన్‌ వర్గంపై విరుచుకుపడుతున్నారు. అప్పుడు మీరు చేసిన వీడియోలపై ఎదుటివారికి ఎలా నొప్పి ఉంటుందో ఇప్పుడు తమదగ్గరికి వచ్చేదాకా తెలియదా..? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

    Also Read: బుక్కైన రఘురామ.. జగన్ ప్రతీకారం మొదలైందా?

    పవన్‌కల్యాణ్‌, జగర్‌ వర్గాల మధ్య మొదటి నుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయి ఉంది. ఎన్నికల తరువాత కొంచెం తగ్గినా కోల్డ్‌వార్‌ కొనసాగుతూనే ఉంటోంది. అయితే త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వివాదాలు బయటకు వస్తున్నాయా..? అనే చర్చ సాగుతోంది. కాగా కామెడీ షోలో కేవలం జగన్‌పై ఇమిటేట్‌ చేస్తే జగన్‌ వర్గం మాత్రం మెగా ఫ్యామిలీ లేడిస్‌ను సైతం వదలడం లేదు. దీంతో వీరి వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి..