Hyderabad Skywalk: 390 మీటర్ల ఎత్తులో స్కైవాక్.. దానికి తోడు 11 ఎలివేటర్లు… ఇది ఎక్కడో కాదు మన హైదరాబాదులోనే… ఇంతకీ ఇది ఏ ప్రాంతంలో నిర్మాణమైందనే కదా మీ డౌట్.. ఆగండి ఆగండి… అది ఇంకా పూర్తి కాలేదు.. త్వరలో పూర్తి కాబోతోంది.. హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీగా మారిన తర్వాత హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అధారిటీ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తోంది.. ఇందులో భాగంగానే వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పేరుతో రోడ్లు, వంతెనలు, అండర్ పాస్ లు నిర్మిస్తోంది.. వీటిలో కొన్ని ఇప్పటికే పూర్తయ్యాయి.. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.. పూర్తయిన వాటిని ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.. వీటి వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.. ఇక హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కూడా పలు కీలక ప్రాంతాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నది.

దుర్గం చెరువు మీద
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు దుర్గం చెరువు అభివృద్ధికి నోచుకోలేదు.. ఐటి పరిశ్రమ విస్తరించడంతో ఆ ప్రాంతానికి ఎక్కడా లేని డిమాండ్ పెరిగింది.. పైగా దుర్గం చెరువు మీదుగా రాకపోకలు సాగించాలంటే కష్టంగా ఉండేది.. క్రమంలో ఆ చెరువు మీదుగా సస్పెన్షన్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు.. దీనివల్ల ఆ ప్రాంతంలో పర్యాటకం భారీగా పెరిగింది.. వారాంతపు సెలవు దినాల్లో ఉద్యోగస్తులు వారి కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్తున్నారు.. ఇక సినిమా షూటింగ్ లకు అయితే లెక్కేలేదు.. ఈ సస్పెన్షన్ బ్రిడ్జి ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం కృష్ణానది మీద భారీ స్థాయిలో తీగల వంతెన నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

తాజాగా మెహిదీపట్నం వద్ద..
దుర్గం చెరువు వద్ద సస్పెన్షన్ బ్రిడ్జి విజయవంతం కావడంతో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ ఉద్యోగులు రాకపోకలు సాగించే మెహిదీపట్నం మార్గంలో ₹32.97 కోట్ల వ్యయంతో 390 మీటర్ల ఎత్తు లో స్కై వాక్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో 11ఎలివేటర్లు ఉంటాయి.. మెహదీపట్నం రైతు బజార్ కు సమీపంలో రక్షణ శాఖ సరిహద్దు, బస్ బే ఏరియాలో దీన్ని నిర్మించనుంది. ఇది ఆసిఫ్ నగర్ పోలీస్ పోలీస్ స్టేషన్, గుడి మల్కాపూర్ జంక్షన్ పరిధి లో దీన్ని హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ దీన్ని నిర్మించనుంది. ఇది పూర్తయితే హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో రైలు రాయి చేరినట్టే.