https://oktelugu.com/

సిల్వర్ జూబ్లీ వేడుకలా.. సిగ్గుచేటు బాబూ!

సైబర్‌‌ టవర్‌‌ నిర్మాణం.. ఫ్లై ఓవర్లు.. తదితర నిర్మాణాలతో హైదరాబాద్‌ మహానగరానికి ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం కల్పించిన మన హైటెక్‌ ‘బాబు’కు 25 ఏళ్లు నిండాయి..! అదేంటి.. చంద్రబాబు వయసు ఇంకా 25 ఏళ్లు ఏంటని అనుకుంటున్నారా..! అది కాదండి చంద్రబాబునాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టి 25 ఏళ్లు గడిచాయి. ఇక మన తమ్ముళ్లు సిల్వర్‌‌ జూబ్లీ వేడుకలు జరుతున్నారంట..? ఇదిలా ఉంటే.. అసలు ఈ 25 ఏళ్లలో ఏం వెలగబెట్టారని వైసీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. […]

Written By: , Updated On : September 2, 2020 / 10:09 AM IST
one district also gone from chandrababu

one district also gone from chandrababu

Follow us on

సైబర్‌‌ టవర్‌‌ నిర్మాణం.. ఫ్లై ఓవర్లు.. తదితర నిర్మాణాలతో హైదరాబాద్‌ మహానగరానికి ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం కల్పించిన మన హైటెక్‌ ‘బాబు’కు 25 ఏళ్లు నిండాయి..! అదేంటి.. చంద్రబాబు వయసు ఇంకా 25 ఏళ్లు ఏంటని అనుకుంటున్నారా..! అది కాదండి చంద్రబాబునాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టి 25 ఏళ్లు గడిచాయి. ఇక మన తమ్ముళ్లు సిల్వర్‌‌ జూబ్లీ వేడుకలు జరుతున్నారంట..? ఇదిలా ఉంటే.. అసలు ఈ 25 ఏళ్లలో ఏం వెలగబెట్టారని వైసీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.

సీనియర్ ఎన్డీఆర్ 1982, మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. అయితే.. అప్పటికే ఎన్టీఆర్‌‌కు రెండు పెళ్లిళ్లు జరిగాయి. రెండో భార్య అయిన లక్ష్మీపార్వతిని కుటుంబసభ్యులు అంగీకరించలేకపోయారు. దీనికితోడు లక్ష్మీపార్వతి పార్టీపై పట్టు సాధించాలనుకునే క్రమంలో అప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రబాబునాయుడు తిరుగుబావుటా ఎగురవేశారు. టీడీపీ తమదంటూ వాదించడంతో అసలు సంక్షోభం మొదలైంది. ఫలితంగా ఎన్టీఆర్‌‌ సీఎం సీటును వదులుకోవాల్సి వచ్చింది. తర్వాత తర్వాత జరిగిన పరిణామాలతో ఎన్టీఆర్‌‌ మరణించారు. ఆగస్టులో మొదలై సంక్షోభం నెల చివరి నాటికి కొలిక్కి వచ్చింది. దీంతో 1995 సెప్టెంబర్‌‌ 1న చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి రాష్ట్రాన్ని వరుసగా 9 ఏళ్లు ఏలారు.

ప్రస్తుతం ఈ అకేషన్‌ వంకతో సంబరాలు చేసుకుంటుంటే.. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ వేడుకపై ఘాటుగానే స్పందించారు. ‘అధికారంలోకి రావడానికి వెన్నుపోటు రాజకీయాలు చేశారని, చంద్రబాబు డర్టీ పొలిటీషియన్‌గా కీర్తి గడించారని మండిపడ్డారు. వ్యవస్థలను భ్రష్టుపట్టించారని, మీడియాలను మేనేజ్‌ చేస్తూ పాలన సాగించారని దుయ్యబట్టారు. ఇప్పుడు ప్రజల ఛీత్కారానికి గురై పొరుగు రాష్ట్రంలో విశ్రాంతి జీవితం గడుపుతున్నారని విమర్శించారు. దీనికితోడు సీల్వర్‌‌ జూబ్లీ విషెస్‌’ అంటూ సెటైరిక్‌గా ట్వీట్‌ కూడా చేశారు.

‘సిల్వర్ జూబ్లీ వేడుకలా.. సిగ్గుచేటు..! చంద్రబాబు వెన్నుపోటుకు 25 ఏళ్లు గడిచిన సందర్భంలో టీడీపీ నేతలు సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకోవడం హాస్యాస్పదం’ అంటూ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి విమర్శించారు. ఎన్టీఆర్‌పై కుట్ర చేసి.. పదవీ నుంచి దించడమే కాకుండా చెప్పులతో కొట్టి అవమానించారని గుర్తుచేశారు. నాడు టీడీపీ నేతలు చేసిన పనికి ఎన్టీఆర్ ఆత్మ ఇంకా ఘోషిస్తుందన్నారు. ఎన్టీఆర్ నుంచి పార్టీ, గుర్తు కూడా బలవంతంగా లాక్కున్నారని చెప్పారు. ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే ఎందుకు భారతరత్న అవార్డుకు సిఫార్సు చేయలేదని ప్రశ్నించారు.

వ్యవసాయం దండగ అని చరిత్రలో నిలిసిపోయారని, 25 ఏళ్లలో చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏంటని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన 2 రూపాయల కిలో బియ్యం, మద్యపాన నిషేధం ఎత్తివేసిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కుతుందని మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు సంబంధించి చంద్రబాబు ఇచ్చిన లేఖతో అంకురార్పణ జరిగిందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా దక్కకుండా ప్యాకేజీకి అంగీకరించి మోసం చేసింది చంద్రబాబే అని అన్నారు. అమరావతిలో 55 వేల కోట్లకు టెండర్లు పిలిచి ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించని ఘనుడు చంద్రబాబు అని గుర్తుచేశారు. వెన్నుపోటుతో పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు జీరో.. 151 సీట్లు సాధించిన జగన్మోహన్ రెడ్డి హీరో అని ఫైనల్‌గా చెప్పుకొచ్చారు.