అభిమానులకు ‘వకీల్ సాబ్’ గిప్ట్.. అదిరింది..!

పవర్ స్టార్ పుట్టినరోజు వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పెద్ద పండుగే.. ఇక పవన్ ఫ్యాన్స్ చేసే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈసారి నెలముందు నుంచే అభిమానులు సండది మొదలైంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాణ్ అంటూ హ్యాష్ ట్యాగులతో ట్వీటర్, సోషల్ మీడియాలను హీటెక్కించారు. నేడు ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ సంబరాలను రెట్టింపు చేసేలా ‘వకీల్ సాబ్’ ఓ కానుక తీసుకొచ్చాడు. […]

Written By: NARESH, Updated On : September 2, 2020 10:33 am

vakeelsaab motions poster

Follow us on

పవర్ స్టార్ పుట్టినరోజు వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పెద్ద పండుగే.. ఇక పవన్ ఫ్యాన్స్ చేసే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈసారి నెలముందు నుంచే అభిమానులు సండది మొదలైంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాణ్ అంటూ హ్యాష్ ట్యాగులతో ట్వీటర్, సోషల్ మీడియాలను హీటెక్కించారు. నేడు ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ సంబరాలను రెట్టింపు చేసేలా ‘వకీల్ సాబ్’ ఓ కానుక తీసుకొచ్చాడు. దీంతో అభిమానులంతా ఖుషీ అవుతున్నారు.

పవర్ స్టార్ ఇటీవలే సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. బాలీవుడ్లో బిగ్ బి అమితాబ్ నటించిన ‘పింక్’ చిత్రం తెలుగులో నిర్మాత దిల్ రాజు ‘వకీల్ సాబ్’గా నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో పవన్ కల్యాణ్ తొలిసారి క్రిమినల్ లాయర్ పాత్రలో కన్పించబోతున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంతో తెరకెక్కెతున్న ఈ మూవీపై ఇప్పటికే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వకీల్ సాబ్ నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్టు లుక్, సాంగ్స్ కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఇక నేడు పవన్ పుట్టిన రోజును పురస్కరించుకొని ‘వకీల్ సాబ్’ చిత్రయూనిట్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ను రెడీ చేసింది. నేటి ఉదయం 9.09 గంటలకు ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసి పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ మోషన్ పోస్టర్ పవన్ కల్యాణ్ లాయర్ గెటప్ లో అదరగొట్టారు. రఫ్ లుక్కుతో ఆకట్టుకున్నారు. బ్యాక్ గ్రౌండ్లో థమన్ అదిరిపోయే సంగీతాన్ని అందించాడు.

ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నివేదా థామస్, అంజలి, అనన్యలు నటిస్తున్నారు. వీరితో పవన్ కు జోడిగా శృతిహాసన్ నటిస్తుందనే వార్తలు విన్పిస్తున్నాయి. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 80శాతం పైగా పూర్తయింది. కరోనా కారణంగా నిలిచిపోయిన షూటింగులను త్వరలోనే ప్రారంభించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా ‘వకీల్ సాబ్’ను పూర్తిచేసి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం రెడీ అవుతోంది.