Jagan-Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమపై ఫోకస్ పెట్టింది. సినిమా ద్వారా రాష్ట్రానికి ఆదాయం రావాలని భావిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం సినీ పరిశ్రమ పెద్దలు చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమ\ళి లాంటి వారు సీఎం జగన్ ను మరోమారు కలిశారు. వారంతా సినీ పరిశ్రమ కష్టాలపై జగన్ తో గోడు వెళ్లబోసుకున్నారు. సినీ పరిశ్రమను ఆదుకోవాల్సిన అవసరం వచ్చిందని సూచించారు. దీనికి జగన్ కూడా సానుకూలంగా స్పందించి చిత్ర పరిశ్రమ దోహదానికి సహకరిస్తానని చెప్పడం గమనార్హం.

దీంతో ఏపీలో సినీపరిశ్రమకు మంచి రోజులు వచ్చినట్లే అని తెలుస్తోంది. ఇన్నాళ్లు సమస్యలతో కొట్టుమిట్టాడిన పరిశ్రమకు ఊతం దొరికినట్లు అయింది. జగన్ సానుకూలత చూసి మహేశ్, ప్రభాస్ లు జగన్ రిపాలన విధానాన్ని ప్రశంసించారు. జగన్ చూపిస్తున్న చొరవను పొగిడారు. దీంతో వారిలో ఆశావహ దృక్పథం పెరిగింది. ఇక మా సమస్యలు తీరినట్లే అని గుండెల మీద చేయి వేసుకున్నారు.

జగన్ నుంచి ఇంత మంచి నిర్ణయం వస్తుందని వారు అనుకోలేదు. కానీ చిరంజీవి మాత్రం వీరందరిని కలిపి పరిశ్రమపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇదంతా చూస్తున్నప్రతిపక్ష నేత చంద్రబాబుకు మాత్రం ఈ విషయం మింగుడుపడటం లేదు. దీంతో చిత్రపరిశ్రమకు చేయూత అందించేందుకు జగన్ ముందుకొచ్చారు. ఇది శుభ పరిణామమే అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Also Read: పవన్ కళ్యాణ్, చిరంజీవి: కత్తి దూసేది ఒకరు… కాంప్రమైజ్ చేసేది మరొకరు
మరోవైపు రాష్ట్రంలో చిత్రాల నిర్మాణం చేపట్టి రాష్ట్రానికి కూడా ఆదాయం తెచ్చిపెట్టాలని జగన్ యోచిస్తున్నారు. ఇదే విషయాన్ని వారి ముందు వెల్లడించారు. దీనికి అందరు సహకరించాలని సూచించారు. దీనిపై మా యూనిట్ సభ్యులు కూడా సమ్మతం తెలిపారు. రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తూ తమ పరిశ్రమను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు.
మొత్తానికి సినీ పరిశ్రమకు మంచి రోజులు వచ్చినట్లే అని తెలుస్తోంది. ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రావడంతో ఇక చిన్న చిత్రాలు సైతం మనుగడ సాధించే అవకాశం ఏర్పడిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ కోసం శ్రమించిన చిరంజీవి లాంటి వారిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
దీంతో చిత్రపరిశ్రమ కోసం సహకరిస్తానని జగన్ చెప్పడంతో చంద్రబాబు డైలమాలో పడినట్లు అవుతోంది. అన్ని వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలతో బాబు కంగారు పడుతున్నారు. దీంతో ప్రస్తుతం జగన్ సమయం కావడంతో చంద్రబాబు ఇక వేచిచూసే ధోరణిలో పడిపోయినట్లు తెలుస్తోంది.
Also Read: నిరుద్యోగుల సమస్యపై గళం విప్పిన పవన్.. ఇదే జోష్‌తో ముందుకెళ్తారా..?
[…] Also Read: ఇది జగన్ టైం.. చంద్రబాబు ఓపిక పట్టాల్స… […]
[…] Also Read: ఇది జగన్ టైం.. చంద్రబాబు ఓపిక పట్టాల్స… […]