జగన్ గృహ నిర్మాణానికి నిధులు నిల్ !

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రతిష్టాకరంగా చేపట్టిన నవరత్నాల్లో భాగంగా చేపట్టిన 25 లక్షల ఇళ్ల నిర్మాణాలు నిధులు లేక ముందుకు సాగడం లేదు. లక్ష్యాలను త్వరగా చేరుకోమని జిల్లాల అధికారులకు ఒక వంక ఆదేశాలు ఇస్తున్నా, చేసిన పనులకే బిల్లులు చెల్లించక పోతూ ఉండడంతో వారు చేతులెత్తి వేస్తున్నారు. ఇప్పటికే భూసేరణకు రూ.వేల కోట్లు కావాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ మేరకు రుణాలకు కూడా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పటివరకు రుణాలు మాత్రం ఖరారు కావడంలేదు. భూసేకరణ […]

Written By: Neelambaram, Updated On : March 19, 2020 4:13 pm
Follow us on

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రతిష్టాకరంగా చేపట్టిన నవరత్నాల్లో భాగంగా చేపట్టిన 25 లక్షల ఇళ్ల నిర్మాణాలు నిధులు లేక ముందుకు సాగడం లేదు. లక్ష్యాలను త్వరగా చేరుకోమని జిల్లాల అధికారులకు ఒక వంక ఆదేశాలు ఇస్తున్నా, చేసిన పనులకే బిల్లులు చెల్లించక పోతూ ఉండడంతో వారు చేతులెత్తి వేస్తున్నారు.

ఇప్పటికే భూసేరణకు రూ.వేల కోట్లు కావాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ మేరకు రుణాలకు కూడా ప్రయత్నాలు చేస్తోంది.

అయితే ఇప్పటివరకు రుణాలు మాత్రం ఖరారు కావడంలేదు. భూసేకరణ చేసిన అధికారులు నిధుల కోసం ఆర్థికశాఖకు బిల్లులు పంపుతుండగా తగిన బడ్జెట్ కేటాయింపులు లేవని తిరిగి వస్తూ ఉండడంతో జిల్లా అధికారులు ఖంగు తింటున్నారు.

ఇంటి స్థలాలకే నిధులు లేకుండా పోతుంటే ఇక గృహనిర్మాణం ఏ విధంగా చేబడతామని జిల్లా అధికారులు వాపోతున్నారు. నిధుల కొరత కారణంగా భూసేకరణలో జాప్యం జరుగుతున్నదని, తక్షణం తమ బిల్లులు చెల్లించాలని జిల్లా అధికారులు ఆర్ధిక శాఖపై వత్తిడి తెస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు.

నిధుల పరిష్టితిని పట్టించుకోకుండా ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని, భూ సేకరణ పూర్తిచేయాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం పట్ల జిల్లా అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బిల్లులు ఆర్థికశాఖకు చేరకుండానే ముందుగానే ‘తగినంత బడ్జెట్ లేదు’ అంటూ వెనుకకు పంపుతూ ఉండడంతో ఏమిచేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంటున్నదని జిల్లా కలెక్టర్లు వాపోతున్నారు.

దీని నుంచి ముందుకు సాగాలంటే పే అరడ్‌ అకౌంట్స్ అధికారులు రాతపూర్వక ఆదేశాలు రావాలంటున్నారని వారు చెబుతున్నారు. ఇదే సమయంలో చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో కూడా నెలాఖరులోగా అంతా పూర్తి చేయాలన్న ఆదేశాలు ఎలా అమలు చేయగలమంటూ జిల్లాల్లోని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే నిధులు విడుదల చేయకపోతే ఇళ్ల నిర్మాణం, భూసేకరణ కష్టమని వారు తేల్చిచెబుతున్నారు.