Homeజాతీయ వార్తలుHyderabad Drugs : వెయిటర్ కాస్త డ్రగ్స్ కింగ్ పిన్ అయ్యాడు: ఎడ్విన్ ఉదంతంలో విస్తుపోయే...

Hyderabad Drugs : వెయిటర్ కాస్త డ్రగ్స్ కింగ్ పిన్ అయ్యాడు: ఎడ్విన్ ఉదంతంలో విస్తుపోయే వాస్తవాలు ఎన్నో?

Hyderabad Drugs : సద్దుమణిగింది అనుకున్న డ్రగ్స్ వ్యవహారం మరోసారి రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా రాజధాని హైదరాబాదులో డ్రగ్స్ వ్యాపారానికి కీలక సూత్రధారిగా భావిస్తున్న ఎడ్విన్ ను హెచ్ న్యూ టీం అరెస్ట్ చేసింది. అదును చూసి అతడిని దెబ్బ కొట్టింది. అతడి చిట్టాలో 50 వేల మంది దాకా ఫోన్ నెంబర్లు ఉన్నాయి. అతడికి దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ నెట్వర్క్ ఉంది.. ఎడ్విన్ హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు పైగా గోవా డ్రగ్స్ కింగ్ పిన్ కూడా. వాస్తవానికి ఎడ్విన్ కు గోవాలో మూడు హోటళ్ళు ఉన్నాయి. మరో మూడు ఖరీదైన బంగాళాలు కూడా ఉన్నాయి. కానీ అతను చేసేది డ్రగ్స్ దందా. దేశ వ్యాప్తంగా 50 వేల మందితో నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. రోజుకు కోట్లలో దందా సాగిస్తున్నాడు. పోలీసుల నీడ తనను తాకకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ పెద్దపెద్ద లాయర్లను ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ తాను అరెస్టు అయితే సుప్రీంకోర్టు దాకా వెళ్లి బయలు తెచ్చుకునే ప్రయత్నాలకు వెరవడం లేదు. కేవలం డ్రగ్స్ వ్యాపారమే కాదు కోబాలోని అంజనా బీచ్ లో తీర ప్రాంత పరిరక్షణ చట్టాన్ని అతిక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టాడు. అయినప్పటికీ వాటిని కూల్చివేసే సాహసం అధికారులు చేయడం లేదు. కానీ అలాంటి ఘరానా డ్రగ్స్ స్మగ్లర్ ఆటను హైదరాబాద్ పోలీసులు కట్టించారు.

అజ్ఞాతంలోకి వెళ్ళాడు

హైదరాబాదులో కేసు నమోదు అయినప్పటి నుంచి ఎడ్విన్ అజ్ఞాతంలోకి వెళ్ళాడు.. అతని కోసం రెండు నెలలుగా హైదరాబాద్ నగర పోలీసులు గాలిస్తున్నారు.. శుక్రవారం రాత్రి అవకాశం దొరకగానే అరెస్టు చేశారు.. వాస్తవానికి ఈ ఏడాది మొదట్లో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రమ్స్ సరఫరా చేస్తున్న ప్రీతేష్ నారాయణ్ బోర్కర్ ను అరెస్టు చేసిన పోలీసులు.. ఆ తర్వాత హైదరాబాద్ నార్కోటిక్ దర్యాప్తు విభాగంతో కలిసి తీగంతా లాగారు. అదిగో అప్పుడు ఎడ్విన్ బండారం బయటపడింది.. బోర్కర్ కు గోవాలో డ్రగ్స్ సరఫరా చేసే కింగ్ పెనుల చిట్టా పది మంది దాకా ఉందని అర్థమైంది. ఇప్పటికే హెచ్ న్యూ పోలీసులు గోవాలోని హిల్ టాప్ రెస్టారెంట్ యజమాని స్టీవ్ ను అరెస్టు చేశారు. బోర్కర్ కు డ్రగ్స్ అందజేస్తున్న మరో కింగ్ పిన్, కర్లీస్ షాక్ నిర్వాహకుడు ఎడ్విన్ న్యూన్స్ కోసం నుంచి హెచ్ న్యూ పోలీసులు వేట సాగిస్తున్నారు. అయితే అతడు తన న్యాయవాదుల ద్వారా ఇక్కడి కోర్టుల్లో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశాడు.. అయితే వాటిని పోలీసులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వచ్చారు.. హైకోర్టులోను అతనికి బెయిల్ దొరకలేదు. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. అయితే ఇటీవల గోవాలోని అంజనా ప్రాంతంలో ఓ బిజెపి నాయకురాలు అనుమానాస్పద మృతి కేసులో ఎడ్విన్ అరెస్ట్ అయ్యాడు. అయితే ఆ కేసులో ఎడ్విన్ బెయిల్ సాధించాడు. లొంగిపోవాలంటూ ఇదివరకే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీలతో హెచ్ న్యూ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అతడిని అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. అయితే పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తనకు కొవిడ్ వచ్చిందని నకిలీ పత్రం చూపించాడు. అయితే పోలీసులు అనుమానంతో మరోమారు పరీక్ష చేయించడంతో నెగిటివ్ అని తేలింది. తప్పుడు కోవిడ్ సర్టిఫికెట్ సమర్పించడంతో గోవా పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఒక ఎడ్విన్ మాత్రమే కాకుండా మరో 10 మంది దాకా గోవా డ్రగ్స్ కింగ్ పిన్ లకు హైదరాబాద్ కేసులతో సంబంధాలు ఉన్నాయి.

మొదట్లో వెయిటర్

వాస్తవానికి ఎడ్విన్ మొదట్లో గోవాలోని బార్లలో వెయిటర్ గా పని చేసేవాడు. నెమ్మదిగా డ్రగ్స్ దందా ప్రారంభించాడు. గోవాకు వచ్చే విదేశీయులకు డ్రగ్స్ విక్రయిస్తూ కోట్లకు పడగలెత్తాడు. గోవాలో మూడు ఖరీదైన బంగ్లాలు, మూడు బడా హోటళ్ళకు అధిపతి అయ్యాడు.. ఇతడికి వందమంది దాకా ప్రధాన ఏజెంట్లు ఉన్నారు. ఇతని నెట్వర్క్ లో 50 వేలమంది ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వీరిలో 1200 మంది తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ తో సంబంధాలు ఉన్న వారిని పోలీసులు గుర్తించారు. గోవా అంజున బీచ్ లో డ్రగ్స్ విక్రయాలకు, వాటిని ఆస్వాదించేందుకు అనువైన ప్రదేశంగా ఎడ్విన్ నిర్వహించే కర్లీస్ షాక్ కు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. గోవాకు వెళ్లే మత్తు ప్రియులు కర్లీస్ షాక్ ను తప్పనిసరిగా సందర్శిస్తారు. ఇందులో ఎంట్రీ ఫీజు 3,500 నుంచి 5000 వరకు ఉంటుంది.. ఇక్కడ వారంతాలో నిర్వహించే సైకడీలిక్, ట్రాన్స్ మ్యూజిక్ పార్టీల ద్వారా డ్రగ్స్ పిలిచే వారిని ఆకర్షిస్తున్నారు. ఇక హెచ్డి పోలీసులు ఎడ్మిన్ అరెస్టు చేయడంతో గోవా పోలీసులకు కూడా ఎక్కడా లేని ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎడ్విన్ అక్రమంగా నిర్మించిన కర్రీస్ షాక్ ను నేలమట్టం చేశారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular