Tollywood:యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా , హీరో విశ్వక్ సేన్ ల మధ్య భేదాభ్రియాలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ సినిమా విషయంలో విశ్వక్ సేన్ ప్రవర్తన బాగా లేదని అర్జున్ సర్జా ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా రూ.100 కోట్లు ఇచ్చినా.. ఇక అతనితో సినిమా చేసేది లేదని అన్నారు. అల్లు అర్జున్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో తన కూతురు ఐశ్వర్యను పరిచయం చేస్తున్నారు. గిల్డ్ మెంబర్స్ నిర్మాణంలో అనుకున్న ఈ మూవీకి విశ్వక్ సేన్ హీరో. తీరా షూటింగ్ సమయానికి ఆయన క్యాన్సిల్ అని చెప్పారు. దీంతో తీవ్ర నిరాశకు చెందిన అర్జున్ మీడియా సమావేశం పెట్టి విశ్వక్ సేన్ పై ఓ దాదాపు గంటపాటు మాట్లాడారు. అర్జున్ సర్జా ఆరోపణలు విశ్వక్ సేన్ కెరీర్ కు ఎఫెక్ట్ అవుతాయా..? అని చర్చించుకుంటున్నారు.
అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ సేన్ పై సంచలన ఆరోపణలు చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి హీరో ఎవరూ ఉండరని అన్నారు. ‘మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, రామ్ చరణ్, అల్లు అర్జున్ లు పెద్ద స్టార్లు. వాళ్లకేం తక్కువ లేదు. కానీ వర్క్ పై కమిట్మెంట్ తో ఉంటారు. ఒకసారి మాట ఇచ్చిన తరువాత దానికే కట్టుబడి ఉంటారు.. ఈ సినిమాలో జగపతిబాబ నటిస్తున్నాడు. ఆయనను నాకోససం వేరే సినిమా డేట్స్ ను మార్చుకోమని అడిగాను. కానీ కుదరదు అని చెప్పారు. ఎందుకంటే అక్కడి నిర్మాత, డైరెక్టర్ కు ఇబ్బందులు అవుతాయన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అన్నారు..జగపతి బాబు నాకు క్లోజ్ ఫ్రెండ్ .. అయినా ఆయన వర్క్ కమిట్మెంట్ కు సెల్యూట్’ అని అన్నారు.
విశ్వక్ సేన్ కోసం ఎన్నో సార్లు షెడ్యూల్ ను మార్చాం. కానీ షూటింగ్ సమయానికి ‘క్యాన్సిల్ చేయండి..’ అంటూ చిన్న మెసేజ్ పెట్టాడు. ఇలా చెప్పడం వల్ల లైట్ బాయ్ నుంచి ప్రొడ్యూసర్ వరకు ఎంతోమందికి ఇబ్బంది ఉంటుంది. షూటింగ్ చేయాల్సిన ఈ సమయంలో ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఈ నష్టానికి బాధ్యులెవరు..? నేను ఈ ప్రెస్ మీట్ పెట్టింది విశ్వక్ సేన్ ను బదనాం చేయాలని కాదు.. మరో నిర్మాత, దర్శకుల వద్ధ ఇలా ప్రవర్తిస్తే ఇబ్బందులు ఎలా ఉంటాయో ముందే వివరిస్తున్నా..’ అని అర్జున్ చెప్పాడు.
‘పాగల్’ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ ‘అశోక వనంలో అర్జున కల్యాణం’ అనే సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువత యాక్షన్ కింగ్ అర్జున్ తో సినిమా చేయాలని సైన్ చేశాడు. అయితే వీరి మధ్య కొన్ని భేదాభిప్రాయాలు రావడంతో షూటింగ్ క్యాన్సిల్ చేయండి అంటూ మెసేజ్ పెట్టడంతో అర్జున్ ఆగ్రహం చెందాడు. అయితే విశ్వక్ సేన్ గురించి అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం సంచలనంగా మారింది. ముందు ముందు ఆయన నటించే సినిమాలపై ఈ ప్రభావం ఉంటుందా..? అని చర్చించుకుంటున్నారు.
సాధారణంగా సినిమాల్లో ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. కానీ హీరోకున్న పలుకుబడితో కొందరు బయటపడరు. కానీ అర్జున్ సీనియర్ హీరో. తన 42 ఏళ్ల సినీ కెరీర్ పై విశ్వక్ సేన్ దెబ్బ కొట్టాడని కామెంట్ చేయడం సంచలనంగా మారింది. అంతేకాకుండా తన కూతురిని తెలుగులో పరిచయం చేయాలని అనుకున్నా.. కానీ ఆయన ప్రవర్తనతో తీవ్ర మనస్థాపానికి గురయ్యానని అనడం దర్శక, నిర్మాతలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. మరి విశ్వక్ సేన్ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.
Read MoreWeb Title: Tollywood will arjun sarjas commetns affect vishwak sens career
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com