
YS Vivekananda Reddy Murder Case: జంతువును జంతువే వేటాడే ఆటవిక రాజ్యం చూసుంటాం.ఆకలితో ఉండే జంతువు తనలాంటి ప్రాణి అని చూడదు. కేవలం తన ఆకలిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. జాలి, దయ చూపిస్తే ఆకలితో అలమంటించి తన ప్రాణానికి ముప్పు అని భావించి వెంటాడి వేటాడి చంపి తింటుంది. ఏపీలో కూడా అటువంటి ఆటవిక సంస్కృతిని చూపించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఇటువంటి దృశ్యాలే సాక్షాత్కరించాయి. సీబీఐ కోర్టుకు తెలిపిన వివరాల్లో కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెల్లడయ్యాయి.రాజకీయాలు మరీ ఇంత దిగజారిపోయాయా? రాజకీయాల కోసం సొంత మనుషులను చంపుకునే స్థితికి వచ్చారా? అన్న అనుమానం కలుగక మానదు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఓ కుటుంబం చేస్తున్న రాజకీయం మరీ జుగుప్సాకరంగా ఉంది. ఇతరులను బలిచేసేందుకు వెరవని మనస్తత్వం చూస్తుంటే మృగాల కంటే మించిపోయినట్టు అర్ధమవుతోంది. అయితే ఈ వ్యక్తులను మృగాలతో పోల్చలేం. ఎందుకంటే సాటి జంతువుపై దాడిచేసి చంపి అవి దర్జాగా తిరుగుతుంటాయి. వివేకా హత్యకేసులో మృగాలు మాత్రం ఆ తప్పును వేరేవారిపై నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేశాయి.
2019 ఎన్నికల ముందు వైసీపీ టిక్కెట్లు ఖరారు చేసిన రెండు రోజుల ముందు వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సోదరుడు. అప్పటి విపక్ష నేత జగన్ బాబాయ్. పైగా మాజీ మంత్రి. ఏపీ పొలిటికల్ హిస్టరీలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. శత్రు దుర్భేద్యమైన పులివెందులలో అత్యంత దారుణంగా హత్య గావించబడ్డారు. మొదట్లో గుండెపోటు అని నమ్మించారు. తరువాత హత్య అని తేల్చారు. అయితే గుండెపోటు, హత్య మధ్య వైసీపీ నేతల కట్టుకథలు డ్రామాను తలపించాయి. కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం వారిపై సానుభూతి చూపించారు. ఏం జరిగిందో తెలియక ఓట్ల రూపంలో మద్దతు కట్టబెట్టేశారు.
ఓ ముఖ్యమంత్రి సోదరుడు ఇంత దారుణంగా హత్యకు గురవుతాడని ఎవరూ ఊహించరు. రెండు రోజుల కిందట హైదరాబాద్ లో ఓ బాలుడ్ని కుక్కలు రౌండప్ చేసి దారుణంగా చంపేశాయి. అంతకంటే దారుణంగా వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. గొడ్డలితో తలపై వేటు వేశారు. వాస్తవానికి తలపై కొట్టేందుకే భయపడతాం. అటువంటిది మూడు పోట్లు వేశారు. తనను డ్రైవరే హత్య చేయించాడని లేఖ కూడా రాయించారు. తరువాత బాత్ రూమ్ కు ఈడ్చుకొనిపోయి 11 గొడ్డలి పోట్లు వేశారని చెబుతున్నారు. అయితే వివేకానందరెడ్డికి ఈస్థాయి చావు వస్తుందని ఎవరూ ఊహించరు. వైఎస్ కుటుంబంపై ఫ్యాక్షన్ ముద్ర ఉన్న వివేకానందరెడ్డి విషయానికి వచ్చేసరికి ఆ పరిస్థితి లేదు. ప్రత్యర్థులు, శత్రువులు కూడా ఆయ మనస్వత్వానికి ఇష్డపతారు. సౌమ్యుడిగా ఆయనకు పేరుంది. ఆయనలో ఒకేసారి కోపం యాంగిల్ బయటపడింది. మంత్రిగా ఉన్నప్పుడు పులివెందులలోవైసీపీ అడ్డుకున్నప్పుడు మీషం మెలేశారు. ఆయనలో కోపం అప్పుడే చూశామని స్థానికులు చెబుతుంటారు. వాస్తవానికి 2017 నుంచే వివేకానందరెడ్డిపై స్కెచ్ వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత వారే వెన్నుపోటు పొడిచారు.
వివేకా హత్య జరిగిన తరువాత అనుకూల మీడియా, సోషల్ మీడియా గుండెపోటు ఎపిసోడ్ ను రక్తికట్టించింది. గాయాలను మేనేజ్ చేసి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అప్పుడే సీన్ లోకి దిగారు ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు. గుండెపోటు కాదు హత్యగా తేల్చారు. పాపం దాని ఫలితమే ఇప్పుడు వెంకటేశ్వరరావుకు ఏ స్థాయిలో ఇబ్బందిపెట్టారో తెలిసిందే. గుండెపోటు కట్టుకథ వర్కవుట్ అయ్యేసరికి ‘హూ కిల్డ్ బాబాయ్’ అన్నది తెరపైకి వచ్చింది. దీన ముఖాలు వేసుకొని సానుభూతి కథలు చెప్పడం ప్రారంభించారు. దానిని రాజకీయ ప్రత్యర్థులపై నెట్టేసి.. ప్రజల్లో సానుభూతి సృష్టించి ఓట్లను కొల్లగొట్టారు. రాజకీయంగా వివేకా హత్యను క్యాష్ చేసుకున్నారు.

ఉదయం 6 గంటల తరువాత.. పని మనిషి వచ్చే వరకూ వివేకా హత్య బయటపడలేదని నమ్మించారు. అటువంటప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డికి అంతకంటే ముందు ఎలా తెలిసిందన్నదే పాయింట్. వేకువజామున 3 గంటల నుంచే పలుమార్లు అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి జగన్, ఆయన సతీమణి భారతి వ్యక్తిగత సహాయకులకు ఎందుకు ఫోన్ చేసినట్టు అని అవినాష్ రెడ్డిని ప్రశ్నించినప్పుడే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చినట్టు భావిస్తున్నారు. ఇన్ని రోజులు కథలు చెప్పినా.. ఈ ఏపిసోడ్ లో కర్త, కర్మ, క్రియ ఇలా అన్నింటినీ సీబీఐ వెతికి పట్టుకుంటోంది. త్వరలో అసలు సూత్రధారి పేరు సైతం వెల్లడయ్యే చాన్స్ ఉంది. వివేకా హత్య చేయించింది సొంత మనుషులేనని నిర్థారణ అయ్యింది. కానీ తాము తప్పు చేయడమే కాదు.. ఆ తప్పును ఇతరులపై నెట్టడానికి చూడడం, దానికి రాజకీయ రంగు పులమడం మాత్రం జుగుప్సాకరం.
హత్య జరిగిన తరువాత, ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు నిలువెత్తు ఫొటో పెట్టారు. అతడి చేతిలో వేట కత్తిని గ్రాఫిక్ తో అతికించారు. నారాసుర రక్తచరిత్ర అంటూ సాక్షిలో పతాక శీర్షిక కథనాన్ని వండి వార్చారు. చంద్రబాబే చేయించాడని ప్రజలు నమ్మించి ఓట్లు గుద్దించుకున్నారు. అక్కడితో ఆగకుండా తోబుట్టువు అని చూడకుండా వివేకా కుమార్తె సునీత, ఆమె భర్తను కూడా ఇరికించేందుకు ప్రయత్నించారు. వివేకానందరెడ్డికి రంకు అంటకట్టి రెండో భార్యను తెరపైకి తెచ్చారు. ఆస్తి వివాదాల్లో భాగంగానే హత్య చేయించారని కొత్త కథ చెప్పుకొచ్చారు. అయితే అప్పటికే అసలు విషయాలు పసిగట్టిన సీబీఐ లైట్ తీసుకుంది. చివరకు సీబీఐ అధికారులను కూడా బెదిరించే స్థాయికి రావడంతో కేసు బిగుసుకుంది. తెలంగాణకు కేసు మారడంతో సీన్ కూడా శరవేగంగా మారింది. అసలు నిందుతుల చిట్టాను బయటపెట్టి నిందితుల అరెస్ట్ తో కేసును క్లోజ్ చేయాలన్న తలంపులో సీబీఐ ఉంది.