YCP MPs: ఇప్పుడు ఏపీ వ్యవహారం పార్లమెంటులో హాట్ టాపిక్ గా మారిపోయింది. ముఖ్యంగా ఏపీ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని పార్లమెంటు సాక్షిగా వైసీపీ ఎంపీలు చెప్పడం, కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేయడం ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. అయితే వైసీపీ ఎంపీలు చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు ప్రతిపక్షాలకు మంచి అస్త్రంగా మారబోతున్నాయి. ఇప్పటి వరకు ఏపీ ఆర్థిక పరిస్థితుల మీద ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేస్తూనే ఉన్నాయి.

అయితే వాటిని కొట్టి పారేస్తూ వచ్చిన వైసీపీకి ఇప్పుడు ఏకంగా వైసీపీ ఎంపీలే చేసిన కామెంట్లు షాపంగా మారుతున్నాయి. ప్రస్తుతం సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేయడంతో ఖజానా ఖాళీ అవుతోంది. దీంతో చేసేది లేక ఏపీ ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తోంది. ఇక ప్రతిసారి అప్పులు అనడంతో కేంద్రం కూడా పట్టించుకోవట్లేదు. పెద్దగా సహకరించట్లేదు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్దితి మీద వైసీపీ ఎంపీలు మాట్లాడుతూ నిధులు కేటాయించాలంటూ కేంద్రాన్ని కోరారు.
అయితే ఎంపీల వ్యాఖ్యల మీద సీరియస్ అయ్యారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఇప్పుడు ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలకు వైసీపీ ప్రభుత్వమే కారణం అని విమర్శించారు. ఇప్పటికే ప్రభుత్వ బడ్జెట్ దిగజారుతోందని రెవెన్యూ లోటు బాగా ఉందని చెప్పారు. అయితే ఈ స్థాయిలో అప్పులు పెరిగిపోవడానికి జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని సంక్షేమ పథకాలే కారణమంటూ ఘాటు కామెంట్లు చేశారు. సంక్షేమం పేరిట అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితులు వచ్చాయని నిర్మల కుండబద్దలు కొట్టేశారు.
Also Read: Jagan: జనంలోకి జగన్.. విశాఖ పర్యటనపై అనేక ఊహాగానాలు..!
ఆమె వ్యాఖ్యలతో వైసీపీ ఎంపీలకు పార్లమెంటులో షాక్ తగిలింది. అయితే ఇన్ని రోజులు వైసీపీ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మీద ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ వచ్చింది. అప్పుల మీద అప్పులు చేస్తూ ఇందుకు టీడీపీ గతంలో తీసుకున్న నిర్ణయాలు, గత ప్రభుత్వం చేసిన అప్పులే కారణమంటూ ఇన్ని రోజులు చెప్పొకొచ్చింది వైసీపీ. కానీ ఇప్పుడు పార్లమెంటు సాక్షిగా సంక్షేమ పథకాలే కారణమని, అభివృద్ధిని పట్టించుకోలేదని కేంద్ర మంత్రి చెప్పేయడంతో భంగపాటు తప్పట్లేదు. ఇక కేంద్రమంత్రి వ్యాఖ్యలను టీడీపీ అస్త్రంగా వాడుకునే ఛాన్స్ ఉంది.
Also Read: Chandrababu: ఆ అస్త్రాన్ని వాడేసేందుకు చంద్రబాబు రెడీ.. జగన్‌కు చిక్కులు..!