Telugu Academy: సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. తెలుగు అకాడమీ కేసులో ఏపీకి అనుకూల తీర్పు వచ్చింది. దీంతో ఏపీ విభజన సమయంలో ఏర్పడిన పంచాయితీ కోర్టు వరకు చేరింది. 2014లో రెండు రాష్ట్రాలు విడిపోవడంతో తెలుగు అకాడమీ పై చిక్కు ఏర్పడింది. ఈనేపథ్యంలో ఉద్యోగుల విషయంలో డబ్బుల పంపిణీలో ఏకాభిప్రాయం కుదరలేదు దీంతో వ్యవహారం కాస్త సుప్రీంకోర్టుకు చేరింది.

తెలుగు రాష్ట్రాలు విడిపోయే సమయంలో ఎటూ తేలకుండా ఉన్న తెలుగు అకాడమీ కేసులో రెండు ప్రాంతాలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ వ్యవహారంలో రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత రాలేదు. దీంతో రెండు ప్రాంతాల వారు ఒప్పుకోకపోవడంతోనే కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. తెలుగు అకాడమీలో పంపకాల విషయంలో ఏర్పడిన పంచాయితీ ఇప్పుడు కోర్టు విచారణలో తేలింది.
Also Read: Manoj Bajpayee: బాలీవుడ్ వెన్నులో వణుకు పుట్టింది.. చిచ్చు రేపుతున్న నటుడు కామెంట్స్ !
ఈ నేపథ్యంలో పలు దఫాలు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది ఎట్టకేలకు తీర్పు వెలువరించింది. పెండింగ్ లో ఉన్న రూ. 33 కోట్లను 6 శాతం వడ్డీతో ఏపీకి తెలంగాణ చెల్లించాలని చెప్పింది. దీంతో ఏపీకి ఇప్పటికే రూ. 92.94 కోట్లు చెల్లించినట్లు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరించింది. కాగా సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని సూచించింది.

ఇన్నాళ్లు మొండికేసిన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీకి డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఇంతకాలం బుకాయించినా కోర్టు తీర్పుతో ఇక డబ్బులు చెల్లించక తప్పని పరిస్థితి. అన్ని కేసుల్లో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలే తగిలినా ఈ కేసులో మాత్రం ఏపీకి ఊరట లభించింది. తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు వస్తుండటంతో హర్షం వ్యక్తం చేస్తోంది.
Also Read:
Inspiring Story: ఆ మహిళలా మజాకా.. వాళ్లను చూసి నేర్చుకోవాల్సిందే
Recommended Videos