కేసీఆర్ సర్కార్ కు షాక్: హఫీజ్ పేట భూములపై హైకోర్టు సంచలన తీర్పు

సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కు కారణమైన హఫీజ్ పేట భూముల విషయంలో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హఫీజ్ పేట సర్వేనంబర్ 80లోని రూ.వేల కోట్ల వివాదాస్పద భూములపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. 140 ఎకరాల భూములువ వక్ఫ్ బోర్డు, ప్రభుత్వానికి కాదని.. ప్రైవేటు వ్యక్తులవేనని స్పష్టం చేసింది. ఆ వివాదాస్పద భూములు తమవేనంటూ మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రవీణ్ రావుతోపాటు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుధీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈరోజు […]

Written By: NARESH, Updated On : March 30, 2021 9:17 pm
Follow us on

సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కు కారణమైన హఫీజ్ పేట భూముల విషయంలో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

హఫీజ్ పేట సర్వేనంబర్ 80లోని రూ.వేల కోట్ల వివాదాస్పద భూములపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. 140 ఎకరాల భూములువ వక్ఫ్ బోర్డు, ప్రభుత్వానికి కాదని.. ప్రైవేటు వ్యక్తులవేనని స్పష్టం చేసింది.

ఆ వివాదాస్పద భూములు తమవేనంటూ మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రవీణ్ రావుతోపాటు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుధీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈరోజు తీర్పు వెల్లడించింది. పిటీషనర్లకు రూ. 4 లక్షలు చెల్లించాలని వక్ఫ్ బోర్డు, ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం సూచించింది.

ఆ భూమిలో 50 ఎకరాలు ప్రవీణ్ రావు, సహ యజమానుల పేరిట నమోదు చేయాలని ఆదేశించింది. మరోవైపు హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ భూముల వివాదంలోనే ప్రవీణ్ రావుతోపాటు మరికొంతమందిని కిడ్నాప్ చేశారంటూ ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ తదితరులపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.