
Huzurabad Bypoll Results: దేశంలో అక్టోబర్ 30న జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి చేదు అనుభవమే ఎదురైంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందో ఏమో కానీ పలు చోట్ల క్లీన్ స్వీప్ కావడం సంచనలం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రతిష్ట మసకబారుతోందా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. కొన్ని చోట్ల బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కని వైనంపై అందరిలో చర్చనీయాంశం అవుతోంది. దీంతో బీజేపీకి గడ్డు రోజులొస్తున్నాయా అని సందేహాలు నెలకొన్నాయి.
పశ్చిమబెంగాల్, అసోం, హిమాచల్ ప్రదేశ్ స్టేట్లలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బలే తగిలాయి. పశ్చిమబెంగాల్ లో పార్టీ క్లీన్ స్వీప్ అయింది. టీఎంసీ ముందు మోకరిల్లింది. అసోంలో మాత్రమే ఆశించిన ఫలితాలు రావడం కొంత ఊరట కలిగించింది. ఈ నేపథ్యంలో బీజేపీకి మింగుడుపడని ఫలితాలు చూస్తుంటే నేతల్లో అయోమయం నెలకొంది. ఊహించని ఫలితాలకు పార్టీ కూడా దృష్టి సారిస్తోంది. అసలు ఏం జరిగి ఉంటుందనే కోణంలో పోస్టుమార్టమ్ నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల మెజార్టీ చూస్తుంటే బీజేపీకి షాక్ తగిలింది. డిపాజిట్లు కూడా రాని పరిస్థితి చూస్తుంటే బీజేపీపై వ్యతిరేక గాలి వీస్తోందా అని సంశయాలు వస్తున్నాయి. బెంగాల్ లో నాలుగు సీట్లలోనూ టీఎంసీ అభ్యర్థులు బారీ మెజార్టీతో విజయం సాధించి బీజేపీకి షాక్ ఇచ్చింది. లక్ష ఓట్ల భారీ మెజార్టీ సాధించి బీజేపీకి సవాల్ విసిరింది. బీజేపీ అభ్యర్థులకు కేవలం 14 శాతం ఓట్లు రావడం గమనార్హం. తృణమూల్ అభ్యర్థులకు 75 శాతం ఓట్లు రావడం చూస్తుంటే బీజేపీకి నష్టాన్నే మిగిల్చింది.
హిమాచల్ ప్రదేశ్ లో కూడా బీజేపీకి కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. మండి లోక్ సభ స్తానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. 2019లో గెలిచిన బీజేపీ అభ్యర్థి రామ్ స్వరూప్ శర్మ 4.05 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందినా ఆయన మృతితో ఉప ఎన్నిక జరగగా మాజీ సీఎం వీరభద్రసింగ్ భార్య ప్రతిభాసింగ్ గెలుపొందడం విశేషం. ఓ సిటింగ్ సీటును కూడా బీజేపీ కోల్పోయింది. దీంతో ఇక్కడ కూడా బీజేపీకి ఫలితాలు నెగెటివ్ గానే వచ్చాయి.
కర్ణాటకలో కూడా బీజేపీకి చేదు ఫలితాలే మిగిలాయి. బీజేపీ సిటింగ్ సీటును కాంగ్రెస్ గెలుచుకుని బీజేపీకి సవాలు చేసింది. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సొంత జిల్లా హావేరిలోని హానగల్ లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస మానె 7426 మెజార్టీతో గెలుపొందారు. మధ్యప్రదేశ్ లో మాత్రం కొంత ఉప శమనం కలిగింది. ఖాండ్వా సిటింగ్ లోక్ సభ స్తానాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. కాంగ్రెస్ కు చెందిన రెండు అసెంబ్లీ సీట్లను బీజేపీ గెలుచుకుంది.
దీంతో ఉప ఎన్నికల ఫలితాలు చూస్తుంటే బీజేపీకి వ్యతిరేకత వచ్చిందని తెలుస్తోంది. త్వరలో జరగబోయే అయిదు స్టేట్ల ఎన్నికల నేపథ్యంలో ఇలా బీజేపీ డీలా పడటం చూస్తుంటే రాబోయే కాలంలో పార్టీ అధికారం చేపట్టడం కష్టమేమో అనే సంకేతాలు వెలువడుతున్నాయి.