
Tollywood Movies: వచ్చే ఏడాది సంక్రాంతి బెర్తులు ఇప్పటికే నిండిపోయి.. బెర్త్ కోసం స్టార్ హీరోలే కిందామీదా పడుతున్నారు. అసలు అన్నటికి కంటే ముఖ్యంగా ‘ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ అవుతుంది. మరో వైపు ‘రాధే శ్యామ్’ కూడా సిద్ధం అవుతుంది. ఇక భీమ్లా నాయక్, సర్కారు వారి పాట సినిమాలు సైతం సంక్రాంతికే వస్తున్నాయి. రిలీజ్ డేట్లు పోస్ట్ ఫోన్ అయ్యాయి అంటున్నారు గానీ, ఇప్పటికైతే అధికారిక ప్రకటన లేదు.
మేకర్స్ నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం.. ముందు ఎనౌన్స్ చేసిన డేట్లుకే తమ సినిమాలు రిలీజ్ అవుతాయి అంటున్నారు. అంటే.. వచ్చే సంక్రాంతికే భీమ్లా నాయక్, సర్కారు వారి పాట రాబోతున్నాయి. నాలుగు సినిమాలు ఫుల్ క్రేజీ సినిమాలే. ఈ సినిమాలతోనే సంక్రాంతి ఉక్కిరిబిక్కిరి అయిపోయేలా ఉంటే.. మరో వైపు బంగార్రాజు కూడా నేను సైతం అంటూ సంక్రాంతి డేటు కోసం తాపత్రయ పడుతున్నాడు.
అసలు వీటన్నింటి మధ్య మరో సినిమాకి బెర్త్ లేదు. ఈ భారీ సినిమాలతో తెలుగు బాక్సాఫీసు ఫుల్ రష్ గా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న సినిమాని రిలీజ్ చేయాలని ఎవరైనా అనుకుంటారా ? అనుకున్నారు. ఆయనే సీనియర్ హీరో రాజశేఖర్. తాను కూడా సీనియర్ హీరోని కాబట్టి.. సంక్రాంతి బరిలో దిగడానికి రెడీ అవుతున్నాడట.
రాజశేఖర్ ప్రస్తుతం ‘శేఖర్’ అనే సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి పండక్కి విడుదల చేయాలని రాజశేఖర్ ఫిక్స్ అయ్యారట. అసలు ఎలాంటి పోటీ లేని సమయంలో వస్తేనే రాజశేఖర్ ను లైట్ తీసుకుంటారు. లాంటిది టాప్ హీరోలు అంతా పోటీ పడే సమయంలో వస్తే.. ఇక రాజశేఖర్ ను ఎవరు పట్టించుకుంటారు ?
గరుడ వేగతో ఒక హిట్ అందుకున్నాడు రాజశేఖర్. అది కూడా ఏవరేజ్ హిట్. అయితే, ఆ సినిమా పేరు చెప్పి తనలోని స్టామినా ఇంకా తగ్గలేదని అంటున్నాడట. అసలు శేఖర్ సినిమా పై అసలు ఎవరికి ఎలాంటి ఆశలు లేవు. సంక్రాంతి సీజన్ లో రావడం కచ్చితంగా రాజశేఖర్ కు తీవ్ర నష్టమే.