రెండు దశాబ్దాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో రమ్యకృష్ణ ఒకరు. అందం, అభినయం ఉన్న రమ్యకృష్ణ ఆ తరువాత కాలంలో పరిమిత సంఖ్యలో సినిమాల్లో నటిస్తూ అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పించారు. శ్రీదేవి రిజెక్ట్ చేయడంతో బాహుబలి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రమ్యకృష్ణ శివగామి పాత్రలో విశ్వరూపం చూపించారు.
ఇతర ఇండస్ట్రీలకు సైతం బాహుబలి, బాహుబలి 2 సినిమాల ద్వారా సుపరిచితమైన రమ్యకృష్ణ పారితోషికం వల్ల తాజాగా వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు సినిమాకు కోటి రూపాయల నుంచి రెండు కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. అయితే స్టార్ హీరోయిన్లను మించిపోయే రేంజ్ లో శివగామి పారితోషికం డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది.
కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల చాలామంది నిర్మాతలు పారితోషికం తగ్గించుకోవాలని నటులను, దర్శకులను కోరుతున్నారు. అయితే రమ్యకృష్ణ గతంలో కాల్ షీట్ కు 5 లక్షల రూపాయల చొప్పున డిమాండ్ చేయగా ఇప్పుడు రెట్టింపు పారితోషికం డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఆమె ఒక సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ లో నటిస్తే హీరోయిన్ కంటే రమ్యకృష్ణకే ఎక్కువ పారితోషికం దక్కుతుంది.
రమ్యకృష్ణ పారితోషికం పెంచిన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం రమ్యకృష్ణ తల్లి, అత్త లాంటి పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం రమ్యకృష్ణ తెలుగు, తమిళంలోని పలు చిత్రాల్లో నటిస్తున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఫైటర్ చిత్రంలో రమ్యకృష్ణ విజయ్ తల్లిగా కనిపించబోతున్నారు.