https://oktelugu.com/

ఏపీకి షాక్: ప్రాజెక్టులపై తెలంగాణ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ షాకిచ్చింది. అనుమతులు లేకుండా ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతోపాటు పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను తక్షణమే ఆపేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేయడం సంచలనమైంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ ఫైట్ కు రెడీ అయ్యింది. ఈమేరకు నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్.. కృష్ణా బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ కు లేఖ రాశారు. జాతీయ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 22, 2021 / 08:56 PM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ షాకిచ్చింది. అనుమతులు లేకుండా ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతోపాటు పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను తక్షణమే ఆపేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేయడం సంచలనమైంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ ఫైట్ కు రెడీ అయ్యింది. ఈమేరకు నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్.. కృష్ణా బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ కు లేఖ రాశారు.

    జాతీయ హరిత ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) స్టే విధించినప్పటికీ ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం సాక్ష్యాలతో ఫొటోలను తీసి మరీ ఫిర్యాదు చేయడం సంచలనమైంది.

    ఎన్జీటీ ఆదేశాలను కృష్ణా బోర్డు సైతం అడ్డుకోలేకపోయిందని.. డీపీఆర్ కోసం ప్రాథమిక పనులు అని చెప్పిన ఏపీ ప్రభుత్వం అక్కడ ప్రాజెక్టు పనులను కొనసాగిస్తోందని ఆక్షేపించారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు కృష్ణా బోర్డు కనీసం నిజనిర్ధారణ కమిటీని కూడా అక్కడకు పంపలేకపోయిందని ఆక్షేపించిందన్నారు.

    కృష్ణా బోర్డు అనుమతులు , ఆమోదం లేకుండా పనులు చేపట్టరాదని కేంద్రప్రభుత్వం కూడా ఆదేశించిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు.

    ఏపీ ప్రభుత్వం చర్యలతో తెలంగాణలోని కృష్ణాబేసిన్ లో ఉన్న కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలపై ప్రభావం పడుతుందని తెలిపారు. అనుమతుల్లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, పొతిరెడ్డిపాడు పనులను తక్షణమే ఆపేలా తగు చర్యలు తీసుకోవాలని బోర్డుకు విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయబద్దమైన వాటాను పరిరక్షించాలని కోరారు.

    తెలంగాణ సీఎం, మంత్రులు ఇటీవల ఏపీ జలదోపిడీపై తీవ్రంగా ఆక్షేపించారు. అంతేకాదు.. తాజాగా ఫిర్యాదుల వరకు వెళ్లడంతో విషయం సీరియస్ అయ్యింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది వేచిచూడాలి.