https://oktelugu.com/

Modi Kendriya Vidyalaya: పెంచమంటే తగ్గించాడే.. మోడీ మార్క్ షాక్ ఇదీ

Modi Kendriya Vidyalaya: మోడీ తీరే వేరు.. బీజేపీ ఎంపీలు ఒత్తిడి చేశారని పెంచాల్సింది పోయి.. ఏకంగా తగ్గించి షాక్ ఇచ్చాడు. మోడీసార్ ఈ రేంజ్ లో షాక్ ఇస్తాడని తెలియక ఇప్పుడు బీజేపీ ఎంపీలందరూ నెత్తినోరు బాదుకుంటున్నారు. ఇటీవల కేంద్రీయ విద్యాసంస్థల్లో ఎంపీల కోటా 10 సీట్లను పెంచాలని వారంతా కేంద్రంపై ఒత్తితెచ్చారు. కానీ ఉన్న 10 సీట్లను కూడా కట్ చేసి మోడీ సర్కార్ గట్టి హెచ్చరికలు పంపింది. ఇప్పటివరకు కేంద్రీయ విద్యాలయాల్లో స్థానిక ఎంపీలు, […]

Written By: NARESH, Updated On : April 14, 2022 12:01 pm
Follow us on

Modi Kendriya Vidyalaya: మోడీ తీరే వేరు.. బీజేపీ ఎంపీలు ఒత్తిడి చేశారని పెంచాల్సింది పోయి.. ఏకంగా తగ్గించి షాక్ ఇచ్చాడు. మోడీసార్ ఈ రేంజ్ లో షాక్ ఇస్తాడని తెలియక ఇప్పుడు బీజేపీ ఎంపీలందరూ నెత్తినోరు బాదుకుంటున్నారు. ఇటీవల కేంద్రీయ విద్యాసంస్థల్లో ఎంపీల కోటా 10 సీట్లను పెంచాలని వారంతా కేంద్రంపై ఒత్తితెచ్చారు. కానీ ఉన్న 10 సీట్లను కూడా కట్ చేసి మోడీ సర్కార్ గట్టి హెచ్చరికలు పంపింది. ఇప్పటివరకు కేంద్రీయ విద్యాలయాల్లో స్థానిక ఎంపీలు, రాజ్యసభ సభ్యుల కోటా కింద కేంద్రం ఏటా కొన్ని సీట్లు కేటాయిస్తోంది. అయితే దీనిపై కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. అయితే ఎంపీల దగ్గర పని చేసే సిబ్బందికి వాటిని ఇస్తూ ఈ కోటాను దుర్వినియోగం చేస్తున్నారనే ఫిర్యాదులు కేంద్రానికి అందాయి. దీనిపై హెచ్‌ఆర్‌డీ విచారణ కూడా చేపట్టింది. ఎంపీలకు సీట్లు కేటాయించడం వల్ల నేరుగా వీటి కోసం దరఖాస్తు చేసుకునే వారికి అన్యాయం జరుగుతుందని రాష్ట్రాలు కేంద్రాన్ని నిలదీశాయి. ఎంపీ కోటా ద్వారా కొందరు సీట్లు పొందుతున్నారని ఆరోపించాయి. దీంతో ఈ విధానాన్ని రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

-1975 నుంచి ఎంపీలకు కోటా..
లోక్‌సభ, రాజ్యసభలోని ప్రతీ సభ్యునికి కేంద్రీయ విద్యాలయాల్లో నిర్ణీత కోటాను అడ్మిషన్లను అనుమతించే ప్రత్యేక పథకాన్ని కేంద్రం 1975లో ప్రవేశపెట్టింది. తమ నియోజకవర్గాలకు మెరుగైన మార్గంలో సేవ చేయడంలో సహాయపడేందుకు ఎంపీలకు మరిన్ని విచక్షణాధికారాలను అందించడానికి అప్పట్లో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఇంతకుముందు ఒక ఎంపీ ఒక విద్యా సంవత్సరంలో రెండు అడ్మిషన్లను సిఫారసు చేయవచ్చు అనేలా చట్టం ఉండేది. దీనిని 2011లో ఐదు, 2012లో ఆరు, 2016లో 10కి పెంచారు.

ప్రస్తుతం లోక్‌సభలో 543 మంది ఎంపీలు, రాజ్యసభలో 245 మంది ఎంపీలతో ప్రతి ఏడాది 7,880 అడ్మిషన్లు పొందే అవకాశం ఉండేది. ప్రతి ఎంపీ తన కార్యాలయం నుండి పోస్టల్‌ చిరునామా, ఫోన్‌ నంబర్, ఇమెయిల్‌ చిరునామా వంటి పిల్లల, తల్లిదండ్రుల వివరాలతో కూడిన కూపన్ ను పంపుతారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల జాబితా కేంద్రీయ విద్యాలయం వెబ్‌సైట్‌లో ఉంచబడుతుంది. జాబితాలో విద్యార్థి పేరు కనిపించిన తర్వాత, అధికారిక ప్రవేశ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

-కోటాను మించి ప్రవేశాలు..
ఎంపీలు తమకు కేటాయించిన కోటాటకు మించి అడ్మిషన్లకు సిఫారసు చేస్తున్నారు. ఎంపీలు, మంత్రులు అనేక అభ్యర్థనలు.. ఒత్తిడిలతో ప్రవేశాలు తరచుగా కోటా పరిమాణాన్ని మించిపోయాయి. వాటిలో చాలా వాటిని తిరస్కరించడం కష్టమని వారు పేర్కొన్నారు. 2018–19లో మంజూరైన ఎంపీ కోటా సీట్లు 7,880 ఉండగా.. ఎంపీల సిఫారసు ద్వారా 8,164 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. విద్యాశాఖ మంత్రి కోటాలో 450కి సీట్లు ఉండగా 9,402 మంది విద్యార్థులను తీసుకున్నారు. దీంతో ఈ కోటాను రద్దు చేయాలనే డిమాండ్‌ మరోసారి తెరపైకి వచ్చింది.

-కోటా రద్దుకు ఎప్పటి నుంచో డిమాండ్‌..
కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ సీట్ల కోటా రద్దు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉంది. కోటాను రద్దు చేసే ప్రయత్నాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఎంపీ కోటాను 1997లో తొలగించారు. అయితే 1998లో అప్పటి మానవ వనరుల అభివృద్ధి మంత్రి మురళీ మనోహర్‌ జోషి ఆదేశానుసారం తిరిగి ప్రవేశపెట్టారు.

-లోక్‌సభలోనూ చర్చ..
కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాపై ఇటీవల లోక్‌సభలోనూ చర్చ జరిగింది. అయితే ఎంపీల కోటాను ఎత్తి వేయాలని కొందరు.. ఆ సీట్లను మరిన్ని పెంచాలని మరికొందరు డిమాండ్‌ చేశారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి చర్చించి నిర్ణయాన్ని వెల్లడిస్తామని ప్రకటించింది. ఆ వెంటనే స్పీకర్‌ ఓం బిర్లా కూడా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 10 సీట్ల ఎంపీ కోటా సరిపోదని, సీట్లను మరింత పెంచాలని పార్లమెంట్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. లేదంటే ఎంపీ కోటానే రద్దు చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారి డిమాండ్‌ చేశారు. అయితే ఎంపీల కోటాను రద్దు చేసే యోచనలో కేంద్రం ఉందని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పడంతో పలువురు ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ కోటా కారణంగా అర్హులు నష్టపోతారన్న ఫిర్యాదుల మేరకు కోటా రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ఇక రిజర్వేషన్ల ఆధారంగానే దేశంలోని అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు జరుగనున్నాయి.