Homeఆంధ్రప్రదేశ్‌Margadarsi Case: జగన్ కు బ్రేక్ వేసిన మార్గదర్శి

Margadarsi Case: జగన్ కు బ్రేక్ వేసిన మార్గదర్శి

Margadarsi Case: మార్గదర్శి కేసు విషయంలో జగన్ సర్కార్ కు ఝలక్ తగిలింది. మార్గదర్శి చిట్స్కు రిజిస్ట్రార్ ఇచ్చిన బహిరంగ నోటీస్ పై హైకోర్టు స్టే విధించింది. చందాదారుల నుంచి అభ్యంతరాలు కోరుతూ చిట్స్ రిజిస్ట్రార్ ఇచ్చిన నోటీసును హైకోర్టు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మార్గదర్శి కేసులో జగన్ సర్కార్ దూకుడుకు బ్రేక్ పడినట్లు అయ్యింది.

మార్గదర్శి చందాదారులకు నోటీసులు పేరిట చిట్స్ రిజిస్ట్రార్ భారీగా పత్రికలకు యాడ్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. స్థానిక అనుకూల మీడియాతో పాటు నేషనల్ మీడియా సైతం భారీ ప్రకటనలు ఇచ్చారు. ఇందుకుగాను కోట్లాది రూపాయలు రిజిస్ట్రేషన్ శాఖ ఖర్చు చేసింది. అయితే ఇప్పుడు దానిని కోర్టు తప్పు పట్టినట్లు అయింది. తీసుకోబోయే తదుపరి చర్యలను కోర్టు నిలిపివేసింది. చందాదారులు ఇప్పటికే వేసిన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చామని.. చందా దారుల పిటిషన్లు, మార్గదర్శి పిటిషన్లు కలిపి విచారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు భావిస్తోంది. ఆ రెండు పిటిషన్లు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయన్న విషయం గుర్తించుకోవాలని సూచించింది.

రామోజీరావును ఇబ్బందులు పెట్టాలని లక్ష్యంతో మార్గదర్శికి వ్యతిరేకంగా ఫుల్ పేపర్ యాడ్లు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. 60 ఏళ్లకు పైగా లక్షల మంది ఖాతాదారుల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా లేని మార్గదర్శిని గత కొంతకాలంగా జగన్ సర్కార్ వెంటాడుతోంది. కొద్దిరోజుల కిందట మార్గదర్శి చిట్స్ కి చెందిన కొన్ని గ్రూపులను ప్రభుత్వం నిలిపివేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చిట్లను నిలిపివేయడంపై మార్గదర్శి హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే వాదనలు విన్న హైకోర్టు చిట్స్ రిజిస్ట్రార్ ఇచ్చిన నోటీసులపై స్టే విధించింది.దీనితో జగన్ సర్కార్కు ఝలక్ తగిలినట్లు అయింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version