YCP: విపక్షాల అస్త్రసన్యాసం.. వైసీపీదే ఏకగ్రీవం

ఎన్నికలకు పట్టుమని పది నెలల వ్యవధి కూడా లేదు. ఈ తరుణంలో వచ్చినస్థానిక సంస్థల ఉప ఎన్నికలుఅన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. చాలా చోట్ల సర్పంచులు, వార్డు సభ్యులు మృతి చెందడంతో ఎన్నిక అనివార్యంగా మారింది.

Written By: Dharma, Updated On : August 15, 2023 6:03 pm

YCP

Follow us on

YCP: ఏపీలో స్థానిక సంస్థల ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అధికార పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలను టిడిపి, జనసేన, బిజెపి లు లైట్ తీసుకుంటున్నాయి. చాలా చోట్ల ఎన్నికలు ఏకగ్రీవముయ్యాయి. ప్రధానంగా అధికార పార్టీలోని వర్గాల మధ్య పోటీ నడుస్తోంది. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో వార్డు ఉప ఎన్నికలను సైతం వైసీపీలోని రెండు వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో అక్కడ పరిస్థితి రణరంగంగా మారింది.

ఎన్నికలకు పట్టుమని పది నెలల వ్యవధి కూడా లేదు. ఈ తరుణంలో వచ్చినస్థానిక సంస్థల ఉప ఎన్నికలుఅన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. చాలా చోట్ల సర్పంచులు, వార్డు సభ్యులు మృతి చెందడంతో ఎన్నిక అనివార్యంగా మారింది. అటువంటిచోట్ల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. విపక్షాలకు ఇది మంచి చాన్స్ అయినా..స్థానిక సంస్థల ఎన్నికలంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అందుకే బిజెపి, టిడిపి,జనసేన ల అధి నాయకత్వాలు స్థానిక కేడర్ కు ఎన్నికలను విడిచిపెట్టాయి. అధికార పార్టీ ఒత్తిళ్లు చేయడంతో మూడు పార్టీల లోకల్ క్యాడర్ పోటీకి దూరంగా ఉంటున్నాయి. ఇప్పటికే అధికార వైసిపి చాలాచోట్ల సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసుకుంది.

వైసిపి సర్కార్ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. పంచాయతీల నిధులను పక్కదారి పట్టించింది. సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చింది. ఇప్పటికే గెలుపొందిన సర్పంచులు ఆవేదనతో ఉన్నారు. ప్రజలకు ఏం చేయలేమన్న బాధ వారిలో వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో పంచాయతీ ఉప ఎన్నికలపై విపక్షాల నాయకులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. అక్కడక్కడా పార్టీ కీలక నాయకుల ఆదేశాలతో నామినేషన్లు వేసినా.. గడువు సమీపించేసరికి ఎక్కువమంది ఉపసంహరించుకున్నారు. దీంతో దాదాపు ఉప ఎన్నికలు ప్రకటించిన స్థానాలు ఏకగ్రీవమవుతున్నాయి. అధికార పార్టీలో వర్గాలు ఉన్నచోట మాత్రం పోటీ కొనసాగుతోంది.