https://oktelugu.com/

India Today Survey In AP: వైసీపీకి షాక్.. ఏపీలో ఇండియా టుడే సర్వే సంచలనం

ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ సర్వేలు, ఒపీనియన్ పోల్స్ సర్వసాధారణం. గత కొద్ది నెలలుగా వెలువడుతున్న సర్వేలన్నీ వైసీపీకి ఏకపక్ష విజయాలను కట్టబెట్టాయి.

Written By: , Updated On : August 25, 2023 / 01:14 PM IST
India Today Survey In AP

India Today Survey In AP

Follow us on

India Today Survey In AP: ఏపీలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుందా? సీఎం జగన్ గ్రాఫ్ గణనీయంగా తగ్గుముఖం పడుతోందా? వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రమాద ఘంటికలు తప్పవా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల ఐప్యాక్ సర్వే లీక్ అయ్యిందంటూ కొన్ని వార్తలు వచ్చాయి. వైసిపి 30 నుంచి 40 స్థానాలకు పరిమితం అవుతుందన్నది ఆ సర్వే సారాంశం. అయితే అది లీక్ అనే మాట నుంచి బయటకు వచ్చింది కాబట్టి అంతా లైట్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఒక నేషనల్ మీడియా సంస్థ ఒకటి ఏపీలో ఆసక్తికర ఫలితాలను వెల్లడించింది. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే టిడిపి దే పై చేయి అని స్పష్టం చేసింది. దీంతో అధికార పార్టీకి ఒక్కసారిగా షాక్ తగిలింది.

ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ సర్వేలు, ఒపీనియన్ పోల్స్ సర్వసాధారణం. గత కొద్ది నెలలుగా వెలువడుతున్న సర్వేలన్నీ వైసీపీకి ఏకపక్ష విజయాలను కట్టబెట్టాయి. ఇటీవల టైమ్స్ నౌ ఛానల్ ప్రతి రెండు నెలలకు ఒకసారి సర్వేలను బయటపెడుతోంది. వైసీపీకి 25కి 25 స్థానాలను కట్టబెట్టేస్తోంది. చివరకు వైసీపీ శ్రేణులకు సైతం ఈ సర్వే ఫలితాలు మింగుడు పడడం లేదు. క్షేత్రస్థాయిలో చూస్తే ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతలా సంక్షేమ పథకాలు అందించినా ఏకపక్ష విజయాలు సాధ్యమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ సర్వే లీక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో వైసిపి ఓటమి చవిచూస్తుందని స్పష్టమైంది. అయితే దానిని నిజం చేస్తూ తాజాగా ఇండియా టుడే టీవీ ఛానల్ ఒక సర్వేను ప్రకటించింది.

రాజ్దీప్ సర్దేశాయ్ ప్రకటించిన తాజా సర్వే ప్రకారం ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 15 లోక్సభ స్థానాలు టిడిపికి లభిస్తాయని తేలింది. దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాల ప్రాతిపదికన ఇండియా టుడే సంస్థ సర్వే చేపట్టింది. ప్రజల మూడ్ ను తెలుసుకొని మూడ్ ఆఫ్ ద నేషన్ ప్రోగ్రాం లో సెఫాలజిస్టులు ఒక అంచనా వేశారు. ఇదే సర్వేలో ఏడాది కిందట టిడిపికి ఏడు లోక్సభ సీట్లు లభించాయి. మధ్యలో ఆ సంఖ్య పదికి చేరింది. ఇప్పుడు ఏకంగా 15కు ఎగబాకింది. పొత్తులు లేకుండానే టిడిపికి ఈ స్థానాన్ని లభిస్తాయని ఇండియా టుడే స్పష్టం చేసింది.

గత ఎన్నికల్లో అధికార వైసిపికి 23 పార్లమెంట్ స్థానాలు లభించాయి. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 151 సీట్లను ఆ పార్టీ దక్కించుకుంది. మరోసారి తామే అధికారంలోకి వస్తామని వైసీపీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఇటీవల వెల్లడైన సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. ఇప్పుడు టిడిపికి 15 లోక్సభ స్థానాలు వస్తాయని అంచనా వేయడం వైసిపి జీర్ణించుకోలేకపోతోంది.ప్రతి లోక్సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఈ లెక్కన తెలుగుదేశం పార్టీకి 105 అసెంబ్లీ సీట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Recommended video:
ఇండియా టుడే సర్వే అంచనాలతో ఆంధ్ర రాజకీయాలు హాట్ హాట్ గా | India Today Latest Survey on AP Elections