Chandrababu Bail: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు షాక్ తగిలింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. డిసెంబర్ 8 లోపు కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు కేసు వివరాలు ఎక్కడ మాట్లాడవద్దని ఆదేశించింది. అయితే రాజకీయ కార్యకలాపాల విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చింది.
చంద్రబాబుకు స్కిల్స్ క్యాం కేసులు ఈనెల 20న ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ సిఐడి అభ్యంతరాలు వ్యక్తం చేసినా హైకోర్టు పెద్దగా పట్టించుకోలేదు. అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇచ్చే అధికారం తమకు ఉందని కోర్టు స్పష్టం చేసింది. అయితే దీనిని సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు బెయిల్ పై స్టే విధించాలని కోరింది. ఆ పిటిషన్ సుప్రీంకోర్టు ముంగిటకు వచ్చింది. దీంతో విచారణకు స్వీకరిస్తూ కోర్టు ఆదేశాలు ఇవ్వడం విశేషం.
ఇప్పటికే చంద్రబాబు సుప్రీంకోర్టులో వాస్ పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్టు విషయంలో కనీస నిబంధనలు పాటించలేదని.. ఎటువంటి ఆధారాలు లేవని.. ముఖ్యంగా గవర్నర్ అనుమతి తీసుకోలేదని.. అందుకే ఈ కేసు కొట్టి వేయాలని కోరుతూ క్వాస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. తీర్పు రిజర్వులో ఉంది. రేపు మాకు తీర్పు వస్తుందన్న నేపథ్యంలో.. ఇప్పుడు చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై కోర్టు విచారణకు స్వీకరించడం విశేషం.