కేరళలో లాక్ డౌన్ సడలింపు!

కేరళ రాష్ట్రంలోని గ్రీన్ జోన్‌లో ఈ నెల 20వతేదీ నుంచి లాక్‌డౌన్‌ను సడలించాలని కేరళ సర్కారు నిర్ణయించింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్యను బట్టి రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లుగా జిల్లాలను విభజించింది. కేరళ రాష్ట్రంలోని కొట్టాయం, ఇడుక్కీ జిల్లాలను గ్రీన్ జోన్ గా గుర్తించినందున ఆయా జిల్లాల్లో ఏప్రిల్ 20వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను సడలించాలని సర్కారు నిర్ణయించింది. ఆరంజ్ ఏ జోన్ జిల్లాలైన ఎర్నాకులం, కొల్లం, పధానమితిట్ట ల్లో ఏప్రిల్ 24 […]

Written By: Neelambaram, Updated On : April 18, 2020 11:04 am
Follow us on


కేరళ రాష్ట్రంలోని గ్రీన్ జోన్‌లో ఈ నెల 20వతేదీ నుంచి లాక్‌డౌన్‌ను సడలించాలని కేరళ సర్కారు నిర్ణయించింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్యను బట్టి రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లుగా జిల్లాలను విభజించింది. కేరళ రాష్ట్రంలోని కొట్టాయం, ఇడుక్కీ జిల్లాలను గ్రీన్ జోన్ గా గుర్తించినందున ఆయా జిల్లాల్లో ఏప్రిల్ 20వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను సడలించాలని సర్కారు నిర్ణయించింది. ఆరంజ్ ఏ జోన్ జిల్లాలైన ఎర్నాకులం, కొల్లం, పధానమితిట్ట ల్లో ఏప్రిల్ 24 నుంచి కర్ఫ్యూ ఎత్తివేయాలని నిర్ణయించారు.

కరోనా కేసులు వెలుగుచూసిన కాసర్ గడ్, కన్నూర్, కోజికోడ్, మలప్పురం జిల్లాలను రెడ్ జోన్ గా గుర్తించినందున అక్కడ మే 3వతేదీ వరకు లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. అలప్పుజా, తిరువనంతపురం, పాలక్కాడ్, వయానాడ్, త్రిస్సూర్ జిల్లాలను ఆరంజ్ బి కేటగిరి జోన్ గా గుర్తించి అక్కడ ఈ నెల 20 నుంచి లాక్ డౌన్ ఆంక్షలను సడలించాలని కేరళ సర్కారు నిర్ణయించింది. కేరళలో 245 మందికి కరోనా సోకగా, వారిలో ముగ్గురు మరణించారు. కేరళలో కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో ఆ రాష్ట్ర సర్కారు లాక్ డౌన్ సడలింపుపై నిర్ణయం తీసుకుంది.

మరోవైపు తెలంగాణా రాష్ట్రంలో గ్రీన్ జోన్ లలో లాక్ డౌన్ ఎత్తివేసే అంశంపై 20 తరువాత నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అదేవిధంగా ఏపీలో కేంద్రం ప్రకటించిన విధంగా గ్రీన్ జోన్ లు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 11 జిల్లాలను కేంద్రం రెడ్ జోన్ లుగా పేర్కొంది. దీంతో మే 3వ తేదీ వరకూ లాక్ డౌన్ కొనసాగించాల్సిందే.