Shilpa Chowdary Arrest: శిల్పా చౌదరి.. సాధారణ జనాలకు ఈమె గురించి పెద్దగా తెలియదు. కానీ.. తెలుగు రాష్ట్రాల్లోని కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చాలా బాగా తెలుసు. బడా పారిశ్రామికవేత్తలకూ బాగానే తెలుసు. వీళ్లేనా.. ఏకంగా తెలుగు సినీ హీరోలు కూడా కొందరు బాగా క్లోజ్. ఇన్ని పరిచయాలున్న ఈమెను పోలీసులు అరెస్ట్ చేశారు! మరి, ఇంతకీ ఈమె ఏం చేస్తుంది? వీళ్లతో పరిచయం ఎలా? అసలు అరెస్టు గొడవేంటి? అన్నదేగా మీ డౌట్? అది తెలియాలంటే.. ఈ వార్త చదవాల్సిందే.
శిల్పా చౌదరి ఏం చేస్తుందంటే.. హైదరాబాద్ సిటీలో, నగర శివారు ప్రాంతాల్లో నిత్యం గ్రాండ్ పార్టీలు అరేంజ్ చేస్తూ ఉంటుంది. తనను తాను సోషలైట్ గా చెప్పుకునే ఈ శిల్పా చౌదరి.. ఎందరినో తన వైపు తిప్పుకుంది. బాగా క్లోజ్ అయ్యింది. వారికి ఏమేం అశ చూపిందో తెలియదుగానీ.. అధిక వడ్డీలు ఇస్తానని చెప్పి, బడా బాబుల నుంచి భారీగా డబ్బులు లాగేసిందీ కిలేడి. పైన చెప్పుకున్న వారిలోనూ ఈమె బాధితులున్నారు. వీరిలో యువ సినీ హీరోలు కూడా ఉన్నారు.
చిన్నా చితకా వ్యాపారాలు చేస్తూ.. హైదరాబాద్ లో ఉన్నతాధికారుల నుంచి టాలీవుడ్ నటుల వరకు పరిచయాలు పెంచుకుంది. నిత్యం పేజ్-త్రీ పార్టీలు ఇస్తూ.. హంగామా చేసేది. ఈమె హంగూ ఆర్భాటం చూసి వ్యాపారవేత్తలు, ఫైనాన్సియర్ల దగ్గర్నుంచి.. సినీ ప్రముఖుల వరకూ అడిగినంత డబ్బు ఇచ్చేశారు. అయితే.. తిరిగి మాత్రం ఆ డబ్బు ఇవ్వట్లేదు. ఎప్పుడు ఆడిగినా.. ఏదో ఒక కారణం చెబుతూ కాలం గడిపేస్తోంది.
Also Read: అక్క ‘లవర్’ చెల్లి బెస్ట్ ఫ్రెండ్… తెగింపంటే ఇదీ!
తక్కువ టైంలోనే.. ఇచ్చిన డబ్బుకు రెండింతలు, మూడింతలు ఇస్తానని చెప్పి.. ఏకంగా.. రూ. 200 కోట్లు వసూలు చేసిందట ఈ శిల్పా చౌదరి. అసలు.. డబ్బులు వసూలు చేయడం కోసమే పేజ్- త్రీ పార్టీలు నిర్వహించేదట. పార్టీలకు వచ్చే ప్రముఖులకు తన ప్లాన్లు ఏవో చెప్పి, అధిక వడ్డీలు ఇస్తానని నమ్మించేదట. ఓ పారిశ్రామికవేత్తగా బిల్డప్ ఇవ్వడం.. సోషలైట్ గా ముద్రపడడంతో.. అందరూ ఈజీగా బుట్టలో పడిపోయారు. కోట్లాది రూపాయాలు సమర్పించేసుకున్నారు. తీరా చూస్తే.. అధిక వడ్డీ కాదు కదా., ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వలేదు.
ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితులు.. క్లైమాక్స్ లో పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన హైదరాబాద్ నార్సింగి పోలీసులు.. శిల్పా చౌదరిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఎందరో ప్రముఖులతోపాటు సినీ హీరోలు కూడా బాధితులుగా ఉన్నారని తేలడంతో హాట్ టాపిక్ గా మారింది. మరి, ఇంకెన్ని వివరాలు బయటకు వస్తాయో చూడాలి.
Also Read: ఆమె వెళ్ళిపోతే అతడి పరిస్థితి ఏమిటీ ? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ !