
టెస్టు క్రికెటే తనకు తొలి ప్రాధాన్యమని అందుకోసం టీ20 ప్రపంచకప్ ను కూడా వదులుకుంటానని ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. ఇటీవల మోచేతికి గాయమైన అతడు నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ తో పరిమిత ఓవర్ల క్రికెట్ కు దూరమయ్యాడు. అయితే, తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ వెబ్ సైట్ లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ కు ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం నేను బాగా కోలుకుంటున్నా. నా వ్యక్తిగత కోణంలో ఆలోచిస్తే టెస్టే క్రికెట్ కే తొలి ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పుకొచ్చాడు.