వైఎస్ షర్మిలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. తెలంగాణలో పార్టీ పెట్టి తన ప్రభావాన్ని చూపెట్టాలని భావించిన ఆమెకు ఎధుదుదెబ్బ తగిలింది. రాయలసీమ లిఫ్ట్, ఆర్డీఎస్ కుడి కాల్వ నిర్మాణంలో ఏపీ సర్కారు తీరుపై విమర్శించడానికి టీఆర్ఎస్ నేతలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. ప్రాజెక్టుల విషయంలో షర్మిల నోరు మెదపడం లేదు.
దీంతో తెలంగాణలోతన పార్టీని విస్తరించాలని చూస్తున్న షర్మిలకు ఇబ్బందికరంగా మారుతోంది. పట్టుమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలో షర్మిల ఏం మాట్లాడతారనే దానిపై అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ ప్రయోజనాలే నాకు ముఖ్యమని చెప్పిన షర్మిల ఇప్పుడు పోతిరెడ్డిపాడు, ఆర్డీఎస్ విషయంలో ఏపీని తప్పుపడితే తన తండ్రిని తిట్టినట్లు అవుతుందని భావించి ఏం మాట్లాడకుండా ఉండిపోతోంది. ఇది రాజకీయ అంశం అయినందున తెలంగాణ, ఏపీనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి షర్మిల ఏం చెబుతారని భావిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు ప్రధానంగా జల వివాదంపైనే విమర్శలు చేస్తున్నారు. షర్మిల సమాధానం చెప్పాలని చూస్తున్నారు. కానీ ఆమె ఏమి చెప్పలేకపోతున్నారని తెలుస్తోంది.
ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆంధ్ఱా పార్టీ అనే ముద్ర పడుతుంది. ఒక వేళ అనుకూలంగా మాట్లాడితే తన తండ్రిని దూషించినట్లు అవుతుంది. అందుకే ఈ విషయంలో ఏం మాట్లాడలేకపోతున్నారు. తెలంగాణ నేతలు వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నా మౌనం వహించడమే ప్రధానమి భావిస్తున్నారు. షర్మిలకు మొదట్లోనే పెద్ద సవాల్ ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆమె అనుసరించే విధానంపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనే ఉద్దేశంతో ఆమె ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.