Sharmila Will Win Paleru Constituency: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ ను విమర్శిస్తూ ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. నిరుద్యోగుల సమస్యపై ప్రతి మంగళవారం దీక్ష చేస్తున్నారు. తెలంగాణలో పరిపాలన పక్కదారి పడుతోందని దుయ్యబడుతున్నారు. భవిష్యత్ లో మరిన్ని సమస్యలు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. షర్మిల కొనసాగిస్తున్న పాదయాత్ర ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. ప్రతి రోజు ప్రజలను కలుసుకుని వారి సమస్యలపై చర్చిస్తున్నారు.

వైఎస్సార్ టీపీ అధికారంలోకి వస్తే మీ సమస్యలు అన్ని పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తున్నారు. మరోవైపు పాలేరు నుంచి షర్మిల రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. కొద్ది రోజులుగా వస్తున్న ఆమె పోటీ వ్యవహారంపై ఆమె స్పష్టత ఇవ్వడంతో ఇక అనుమానాలకు తెరపడినట్లు అయింది. ఖమ్మం జిల్లాలో వైఎస్ అభిమానులు చాలా మంది ఉన్నారని తెలుస్తోంది. వారందరి కోరిక మేరకు తాను ఇక్కడి నుంచే పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు.
Also Read: Prakash Raj About Sai Pallavi: దుమ్మురేపుతున్న సాయిపల్లవి వ్యాఖ్యలు.. ఆమెకు మద్దతుగా ప్రకాశ్ రాజ్
వైఎస్సార్ కన్న కలలు వైఎస్సార్ టీపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతాయని చెబుతున్నారు. షర్మిల తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో బాగంగానే పాదయాత్ర చేస్తున్నారు. వైఎస్సార్ అభిమానులను తమ పార్టీలో చేర్చుకుని తద్వారా పోరాటం చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం సమగ్ర ప్రణాళికలు రచిస్తున్నారు. కొద్ది రోజుల్లో వైఎస్సార్ టీపీలో సమూల మార్పులు కనిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇక్కడి వారిలో స్ఫూర్తి నింపాలని చూస్తున్నారు. అందుకే ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నట్లు ప్రకటించి వారిలో ఆత్మస్థైర్యం నింపుతున్నారు. కార్యకర్తల బలంతోనే పార్టీ పునరుత్తేజం అవుతుందని చెబుతున్నారు. ఇందుకు కార్యకర్తలను భారీగా చేర్చుకుని రాష్ట్ర సమస్యలపై పోరాటం చేస్తామని సూచిస్తున్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో పార్టీని సమగ్రంగా తయారు చేసేందుకు పటిష్ట వ్యూహాలు ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది.
షర్మిల పాలేరులో పోటీకి సిద్ధమైనా అక్కడ గెలుస్తుందా? లేక ఓటమి పాలు కానుందా? అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నట్లు షర్మిల ప్రకటించడంతో రాజకీయ సమీకరణలు మారనున్నాయని తెలుస్తోంది. తెలంగాణలో షర్మిలను రానీయకుండా చేయాలనే పార్టీలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆమె పాలేరు నుంచి పోటీ చేసి విజయం సాధించేందుకు ఏం చర్యలు తీసుకుంటారో అనే దానిపై అందరిలో ఆతృత నెలకొంది. ఇప్పటికైతే తెలంగాణలో తన ప్రభావం చూపాలని షర్మిల అన్ని మార్గాల్లో శ్రమిస్తోంది. దీనికి తగు వ్యూహాలు పన్నుతోంది. కానీ ఇక్కడ షర్మిల పోటీ చేయడం సురక్షితమేనా అనే సందేహం కార్యకర్తల్లో వస్తోంది.
Also Read: Actress Indraja- Roja: రోజా వస్తే సీటు వదిలేస్తా.. వైరల్ అవుతున్న ఇంద్రజ కామెంట్లు