Homeఆంధ్రప్రదేశ్‌YS Sharmila: షర్మిల పంపిన కేక్.. లోకేష్ మాత్రమే నవ్వుల పాలయ్యాడే?

YS Sharmila: షర్మిల పంపిన కేక్.. లోకేష్ మాత్రమే నవ్వుల పాలయ్యాడే?

YS Sharmila: మనం చాలా సార్లు చెప్పుకున్నదే.. రాజకీయంలో శాశ్వతమైన శత్రువులు గాని శాశ్వతమైన మిత్రులుగాని ఉండరు. అవసరం మాత్రమే నాయకులు రాజకీయాలు చేస్తూ ఉంటారు. అధికారం కోసం ఎలాంటి పనులకైనా చేసేందుకు వెనుకాడరు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒకప్పుడు శత్రువులుగా ఉన్న వారు ఇప్పుడు మిత్రులైపోయారు. మిత్రులుగా ఉన్నవారు శత్రువులు అయిపోయారు. కానీ కలలో కూడా ఊహించి ఉండని కలయిక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జరుగుతోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఇటీవల క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు, లోకేష్ ను కేక్ లు పంపించారు. గతంలో ఎన్నడు లేని విధంగా షర్మిల కేక్ పంపించడంతో.. ఆ విషయాన్ని లోకేష్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో లోకేష్ చేసిన ఆ ట్వీట్, ఫేస్ బుక్ లో పెట్టిన ఆ పోస్ట్ చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఒకసారి గా ఏపీ రాజకీయాలలో కుదుపు ఏర్పడింది.

లోకేష్ కుమార్ చేసిన ఆ ట్వీట్ ను టిడిపి అనుకూల మీడియా లోకేష్ కోణంలో రాసుకొచ్చింది.. జగన్ అనుకూల మీడియా ప్రభుత్వ అనుకూల కోణంలో రాసుకొచ్చింది. అయితే దీనిపై ఎవరికి వారు సొంత విశ్లేషణలు చేసుకున్నారు. షర్మిల చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇస్తున్నారని.. తన అన్నతో వేగలేకపోవడం వల్లే ఇలాంటి కానుకలు పంపిస్తున్నారని ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి మీడియా సంస్థలు పచ్చ డప్పు కొట్టాయి. పచ్చటి కుటుంబాల్లో రాజకీయాల కోసం కలహాలు సృష్టిస్తున్నారని.. అధికారం కోసం చంద్రబాబు నాయుడు దేనికైనా దిగజారుతారని సాక్షి ఆరోపిస్తూ రాసుకొచ్చింది. అయితే ఈ కేకు విషయంలో దానిని పంపిన వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. దీంతో లోకేష్ ఒక్కసారిగా నవ్వుల పాలయ్యారు.

వైయస్ షర్మిల కేవలం చంద్రబాబు నాయుడు, లోకేష్ కు మాత్రమే కేక్ పంపలేదు. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితకు కూడా క్రిస్మస్ కేక్ పంపారు. అంతేకాదు ఇలా కేకులు పంపే సంప్రదాయాన్ని కొన్ని సంవత్సరాల నుంచి తాను పాటిస్తున్నానని షర్మిల క్లారిటీ ఇచ్చారు. ఇలా కేకులు పంపే విధానాన్ని కూడా రాజకీయం చేయొద్దని విలేకరుల సాక్షిగా హితవు పలికారు. అంటే షర్మిల కేక్ పంపిన నేపథ్యంలో ఆ గిఫ్ట్ బాక్స్ కేవలం లోకేష్ మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మిగతా వారు ఎవరు కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవల తన కుమారుడి నిశ్చితార్థం, వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబు నాయుడుకు అందజేసేందుకు వెళ్లిన షర్మిల అక్కడ విలేకరులతో ఈ విషయం గురించి మాట్లాడారు. షర్మిల ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వైసీపీ అనుకూల సోషల్ మీడియా గ్రూపుల్లో ఈ వీడియోను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది వైసిపి అనుకూల నెటిజన్లు లోకేష్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా షర్మిల కేకును గిఫ్ట్ బాక్స్ రూపంలో పంపిస్తే దాన్ని కూడా లోకేష్ రాజకీయంగా వాడుకున్నాడని.. అనుకూల మీడియాలో తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకున్నాడని.. దేన్నైనా రాజకీయ కోణంలో చూడటం వారికి అలవాటైపోయిందని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం షర్మిల మాట్లాడిన మాటల తాలూకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version