తెలంగాణ కొత్త సచివాలయం టెండర్‌‌: ఆ బిగ్ షాట్స్ కే..

నిరసనలు.. గొడవల మధ్య తెలంగాణ ప్రభుత్వం పాత సచివాలయం బిల్డింగ్‌ను పడగొట్టించింది. కనీసం మీడియాకు కూడా కవరేజీకి అనుమతి ఇవ్వకుండా హైకోర్టు నుంచి అనుమతి రాగానే చకచకా నేలమట్టం చేసేశారు. ఇక ఇప్పుడు కొత్త సచివాలయం మీదనే అందరి దృష్టి పడింది. ఇందుకోసం ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఇందులో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. Also Read: ఇక రిజిస్ట్రేషన్లు స్ట్రాట్.. ధరణి పోర్టల్‌ నేడే షురూ.. కొత్త సచివాలయ భవన సముదాయానికి ఇప్పటికే సీఎం కేసీఆర్ […]

Written By: NARESH, Updated On : October 29, 2020 9:47 am
Follow us on

నిరసనలు.. గొడవల మధ్య తెలంగాణ ప్రభుత్వం పాత సచివాలయం బిల్డింగ్‌ను పడగొట్టించింది. కనీసం మీడియాకు కూడా కవరేజీకి అనుమతి ఇవ్వకుండా హైకోర్టు నుంచి అనుమతి రాగానే చకచకా నేలమట్టం చేసేశారు. ఇక ఇప్పుడు కొత్త సచివాలయం మీదనే అందరి దృష్టి పడింది. ఇందుకోసం ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఇందులో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.

Also Read: ఇక రిజిస్ట్రేషన్లు స్ట్రాట్.. ధరణి పోర్టల్‌ నేడే షురూ..

కొత్త సచివాలయ భవన సముదాయానికి ఇప్పటికే సీఎం కేసీఆర్ ఫైనల్ చేశారు. అయితే, ఆస్కార్ అండ్ పొన్ని అర్కిటెక్చర్స్ తయారు చేసిన నమూనాను కొన్ని మార్పులు చేసి సీఎం ఖరారు చేశారు. ఆధునిక హంగులతో, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పర్యావరణ హితంగా కొత్త సచివాలయం నిర్మాణం కానుంది. ఈ సచివాలయ నిర్మాణానికి సంబంధించి గత నెలలో రోడ్లు భవనాల శాఖ టెండర్లు ఆహ్వానించింది. నిర్మాణ అంచనా వ్యయం రూ.600 కోట్లతో టెండర్లు పిలిచింది.

ఇందుకోసం పలు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు టెండర్లు స్వీకరించింది. నిన్న కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి టెండర్లు కూడా ఖరారయ్యాయి. ఆ టెండర్లని కమిషన్ ఆఫ్ టెండర్స్ ఖరారు చేసింది. కాగా.. ఈ టెండర్‌ని షాపూర్జీ పల్లోంజీ అనే సంస్థ దక్కించుకుంది.

Also Read: తనది కాని చోట..! ఎంపీగా గెలిచినా తృప్తి లేని ‘కోమటిరెడ్డి’..!

ఇక టెండర్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం, షాపూర్జీ-పల్లోంజీ సంస్థల మధ్య అగ్రిమెంట్ జరగనుంది. దాని ప్రకారం 12 నెలల్లోపు సచివాలయం కాంప్లెక్స్‌ను నిర్మించాల్సి ఉంటుంది. ఏ సమయం వరకు ఎంత పూర్తి కావాలో కూడా ప్రభుత్వం టార్గెట్‌ పెట్టనుంది. అయితే.. ఈ దీపావళికే కొత్త సెక్రటేరియట్ భవనాల నిర్మాణం ప్రారంభమైతే వచ్చే ఏడాది దసరా, దీపావళికి పూర్తయ్యే అవకాశాలుంటాయని అధికారులు చెబుతున్నారు. ఇంకేముంది మరికొద్ది రోజుల్లోనే సచివాలయం నిర్మాణానికి పునాది రాయి పడనుందన్నమాట.