Shambhavi Chaudhary: 18వ లోక్ సభ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో అతి చిన్న వయస్కురాలిగా సమస్తిపూర్ నియోజకవవర్గానికి చెందిన ఎల్జేపీ (ఆర్వీ) అభ్యర్థి శాంభవి చౌదరి నిలిచింది. ఆమె తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సన్నీ హజారీని 1,87,251 ఓట్ల తేడాతో ఓడించి లోక్ సభలో అడుగుపెట్టబోతోంది. అతి పిన్న వయస్కురాలిగా (25 సంవత్సరాలు) లోక్ సభకు వెళ్తున్న ఆమె చరిత్ర సృష్టించారు. దర్భంగాలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆమెను ‘పిన్న వయస్కురాలైన అభ్యర్థి’గా కొనియాడారు.
శాంభవి బిహార్ ప్రభుత్వంలో కేబినేట్ మంత్రి, సీఎం నితీష్ కుమార్ కు సన్నిహితుడైన అశోక్ చౌదరి కుమార్తె. ఆమె తాత దివంగత మహావీర్ చౌదరి. ఈయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఇక శాంభవి ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి సోషియాలజీలో మాస్టర్స్ చేసింది. అలాగే లేడీ శ్రీరామ్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకుంది. మాజీ ఐపీఎస్ అధికారి, మహావీర్ మందిర్ ట్రస్ట్ కార్యదర్శి ఆచార్య కిశోర్ కునాల్ కుమారుడు సయాన్ కునాల్ ను ఆమె వివాహం చేసుకుంది.
కాగా, శాంభవి ప్రత్యర్థి సన్నీ హజారీ జేడీయూ మంత్రి మహేశ్వర్ హజారీ కుమారుడు. అయితే రాజకీయ విభేదాల కారణంగా మహేశ్వర్ తన కుమారుడికి మద్దతుగా ప్రచారం చేయలేకపోయారు. పాట్నా ఎన్ఐటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా పొందిన హజారీ 2021 నుంచి సమస్తిపూర్ లోని ఖాన్పూర్ బ్లాక్ ప్రముక్ గా కొనసాగుతున్నారు. బిహార్ లోని సమస్తిపూర్ లోక్ సభ నియోజకవర్గానికి ఎల్జేపీ, ఐఎన్‌సీలకు చెందిన ప్రధాన అభ్యర్థులు పోటీ చేశారు.
‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’ చిత్రంతో ఫేమస్ అయిన శాంభవి సింగ్ ‘10:29 కీ ఆఖ్రీ దస్తక్’లో ప్రీతి పాత్రలో కనిపించింది. అనాథ పిల్లలను విద్య ద్వారా శక్తివంతం చేయాలనే తన తండ్రి కోరికను నెరవేర్చడానికి ప్రీతి చేసిన ప్రయాణం చుట్టూ ఈ షో తిరుగుతుంది. 2024 లోక్ సభ ఎన్నికల చివరి దశలో గురుదాస్పూర్ కాంగ్రెస్ అభ్యర్థి సుఖ్జిందర్ సింగ్ ఓటు వేశారు, గురుదాస్పూర్, పంజాబ్ లకు బలమైన నాయకుడిగా చెప్తారు.