Lok Sabha Elections Results 2024: బీజేపీ, మెజారిటీ, స్టాక్ మార్కెట్.. లోక్ సభ ఎన్నికల ఫలితాల నుంచి తరుచూ వినిపిస్తున్నాయి. జూన్ 1వ తేదీ వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భారీ సీట్లు గెలుస్తుందని చాలా సర్వే సంస్థలు చెప్పాయి. అయితే ఆ ఫలితాలకు ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలకు భారీగా తేడా ఉండడంతో దాని ప్రభావం స్టాక్ మార్కెట్ పై పడింది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను అందుకునేందుకు కావాల్సిన సీట్ల సంఖ్య 32, స్టాక్ మార్కెట్ నుంచి కూడా రూ. 32 లక్షల కోట్లు పెట్టుబడులు ఆవిరయ్యాయి.
32 సీట్లు కోల్పోయి.. రూ.32 లక్షల కోట్లు!
మంగళవారం వెల్లడైన లోక్ సభ ఎన్నికల ఫలితాల గురించి ఫస్ట్ తెలుసుకుందాం. 2024 లోక్ సభ ఎన్నికల్లో, ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి 292 సీట్లు రాగా, ప్రతిపక్ష ఇండి కూటమికి 234 సీట్లు వచ్చాయి. ఇతరులు 17 స్థానాల్లో విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీతో 361-401 సీట్లు వస్తాయని తేలింది. కానీ మ్యాజిక్ ఫిగర్ కే బీజేపీకి 32 సీట్లు తక్కువయ్యాయి. విశేషం ఏంటంటే బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడంతో ఇన్వెస్టర్లు కూడా రూ.32 లక్షల కోట్లు నష్టపోయారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మార్కెట్ ఒక్కసారిగా కుదేలైంది. ఫలితాల రోజు స్టాక్ మార్కెట్ ప్రారంభంతో పతన ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 9.15 గంటలకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్ 1700 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. దీంతో పాటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ కూడా మార్కెట్ ప్రారంభం కాగానే 600 పాయింట్ల నష్టాన్ని చవి చూసింది. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు ఊపందుకోవడంతో స్టాక్ మార్కెట్ పతనం కూడా పెరుగుతూ వెళ్లింది. మధ్యాహ్నం 12 గంటలకు సెన్సెక్స్ 6000 పాయింట్లకు పైగా పతనమవగా, నిఫ్టీ 1900 పాయింట్లకు పెరిగింది. అయితే, మార్కెట్లో ట్రేడింగ్ ముగిసే సమయానికి కొంత కోలుకొని సెన్సెక్స్ 4389.73 పాయింట్లు లేదా 5.74 శాతం క్షీణించి 72,079.05 వద్ద, నిఫ్టీ 1379.40 లేదా 5.93 శాతం క్షీణించి 21,884.50 వద్ద ముగిశాయి.
మంగళవారం (జూన్ 4) బీఎస్ఈ ఎంసీఏపీ భారీగా పతనమైంది. స్టాక్ మార్కెట్ పతనం (స్టాక్ మార్కెట్ క్రాష్) కారణంగా.. మంగళవారం ముగిసే సమయానికి బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ (బీఎస్ఈ మార్కెట్ క్యాప్) దాని మునుపటి ముగింపు రూ .426 లక్షల కోట్ల నుంచి సుమారు రూ .395 లక్షల కోట్లకు పడిపోయింది. దీని ప్రకారం స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఒకే రోజులో రూ.31 లక్షల కోట్లకు పైగా అంటే సుమారు రూ.32 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు.
బీజేపీ సీట్ల సంఖ్యను మాత్రమే సమానం..
బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రావడానికి అవసరమైన సీట్ల సంఖ్యకు సమానంగానే ఇన్వెస్టర్లు నష్టాలు చవి చూశారు. దానికీ దీనికి సంబంధం లేదుకుండా కో ఇన్సిడెంట్ గా రెండు 32 సంఖ్య వద్దే ఆగిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం నష్టపోయిన మార్కెట్ బుధవారం కోలుకుంది.