
పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకంగా ఉధృతంగా నిరసనలు జరిపిన కేంద్రంగా దేశ, విదేశాలలో పేరొందిన ఢిల్లీలోని షాహీన్‌బాగ్ ప్రాంతాన్ని ఢిల్లీ ప్రభుత్వ అధికారులు ఇప్పుడు కరోనా హాట్‌స్పాట్‌గా గుర్తించారు. పోయిన ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు వంద రోజుల పాటు అక్కడ ఆందోళనలు కొనసాగాయి.
ఢిల్లీలో ఆందోళనలపై నిషేధం విధించిన ఆందోళనకారులు వినకుండా నిరసన చేపట్టడంతో అధికారులు వారిని బలవంతంగా అక్కడ నుంచి ఖాళీ చేయించారు. షాహీన్‌బాగ్ ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని హాట్‌స్పాట్ లిస్ట్‌లో చేర్చినట్లు అధికారులు చెప్పారు.
దీంతో ఢిల్లీలో హాట్‌స్పాట్ జోన్లు 60కి చేరాయి. హాట్‌స్పాట్ జోన్లలో అధికారులు ప్రతి ఇంటిని శానటైజ్ చేసి.. డోర్ టూ డోర్ స్క్రీనింగ్ చేస్తున్నట్లు చెప్పారు.
గత 15 రోజులుగా మూడు లొకేషన్స్‌లో ఒక్క కేసు నమోదు కాలేదని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. ఢిల్లీలో శుక్రవారానికి 1640 యాక్టివ్ కేసులు ఉన్నాయని, ఇప్పటి వరకు 38 మంది చనిపోగా.. గురువారం ఒక్కరోజే 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వివరించారు.