https://oktelugu.com/

వైసీపీలో షాడో మినిష్టర్లు.. జగన్ కు కొత్త తలనొప్పి?

వైసీపీలో ఎక్కడ చూసినా షాడో మినిష్టర్ల గురించే చర్చ నడుస్తోంది. జగన్ క్యాబినెట్లో కొందరు మంత్రులు వ్యవహారిస్తున్నతీరు ఆయనకు కొత్త తలనొప్పులను తీసుకొస్తోంది. అధికారం ఒకరిది అయితే పెత్తనం మరొకరు చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పదవులను అడ్డంపెట్టుకొని వారి బంధువులు షాడో మినిష్టర్లు వ్యవహరిస్తుండటం ఇప్పటికే సీఎం జగన్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారనే టాక్ విన్పిస్తోంది. అయితే కొన్నిరోజులు సైలంటై మళ్లీ షాడో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 21, 2020 3:44 pm
    Follow us on


    వైసీపీలో ఎక్కడ చూసినా షాడో మినిష్టర్ల గురించే చర్చ నడుస్తోంది. జగన్ క్యాబినెట్లో కొందరు మంత్రులు వ్యవహారిస్తున్నతీరు ఆయనకు కొత్త తలనొప్పులను తీసుకొస్తోంది. అధికారం ఒకరిది అయితే పెత్తనం మరొకరు చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పదవులను అడ్డంపెట్టుకొని వారి బంధువులు షాడో మినిష్టర్లు వ్యవహరిస్తుండటం ఇప్పటికే సీఎం జగన్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారనే టాక్ విన్పిస్తోంది. అయితే కొన్నిరోజులు సైలంటై మళ్లీ షాడో మినిష్టర్లు పెత్తనం చేస్తున్నారని వైసీపీలో గుసగుసలు మొదలయ్యాయి.

    ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేసిన ఆర్ఆర్ఆర్..!

    జగన్ క్యాబినెట్లో అనేక సమీకరణాల మధ్య కొందరికీ అనుహ్యంగా పెద్ద పదవులు దక్కగా మరికొందరికీ అవకాశం రాలేదు. అయితే మంత్రి పదవులు దక్కించుకున్న కొంతమంది వ్యవహారం ఇప్పుడే చర్చనీయాంశంగా మారింది. వైసీపీ శ్రేణులు ఏదైనా పని కోసం మంత్రుల వద్దకు వెళితే వారికి బదులుగా వారి బంధువులు పెత్తనం చేస్తుండటంతో వారంతా అవాక్కవుతున్నారట. దీంతో ఆ నేతలపై తీరుపై వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు బహిరంగనే విమర్శలు గుప్పిస్తున్నారు.

    ఈనేపథ్యంలోనే మంత్రి శ్రీరంగనాథరాజు కుమారుడుపై ఇటీవల తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి కుమారుడు షాడో మినిస్టర్ గా హల్చల్ చేస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. హోంమంత్రి మేకతోటి సుచరిత కుటుంబంలోనూ ఒక షాడో మినిస్టర్ ఉన్నారనే జోరుగా ప్రచారం జరుగతోంది. ఈయనే నేరుగా బదిలీల వ్యవహారాలు చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలియడంతో సీఎం జగన్ మందలించారని సమాచారం. కొన్నిరోజులు స్తబ్దుగా ఉన్న సదరు షాడో మినిస్టర్ మళ్లీ యథావిధిగా పనులు చక్కబెడుతున్నారట.

    ఆనం సడెన్ సైలెంట్ వెనుక కారణాలేంటీ?

    డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కుటుంబంలోనూ ఒక షాడో మినిష్టర్ చక్రం తిప్పున్నారట. కురుపాం నియోజకవర్గంలో ఆయన చెబితే మంత్రి పనులు చేస్తారని గుసగుసలు విన్పిస్తున్నాయి. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా బంధువు కడపలో షాడో మినిష్టర్ అవతారం ఎత్తగా ఆ జిల్లాకు చెందిన ప్రభుత్వ చీఫ్ విప్ అధిష్టానం వద్దకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

    వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తులను కట్టడి చేసేందుకు జగన్ శాయశక్తుల ప్రయత్నిస్తుంటే షాడో మినిష్టర్ల వ్యవహారం ఆయనకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. వీరి చర్యలతో పార్టీకి చెడ్డపేరు వస్తుండటం జగన్ వీరిపై చర్యలు తీసుకునేందుకు సన్నహాలు చేస్తున్నారట. దీంతో జగన్ వీరికి ఎలా చెక్ పెడుతారనే చర్చ వైసీపీలో జోరుగా నడుస్తోంది.