https://oktelugu.com/

చంద్రబాబు సామ్రాజ్యాన్ని కూల్చే జగన్ ఆయుధం!

ప్రత్యర్థి చాలా బలవంతుడు.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ. చేతిలో బలమైన మీడియా ఉంది. అందుకే ఇన్నేళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చక్రం తిప్పారు. ఇప్పటికీ తిప్పుతున్నారు. ఓడినా.. గెలిచినా తనదే అప్పర్ హ్యాండ్ అని టీడీపీ అధినేత చంద్రబాబు చెలరేగిపోతుంటారు. అలాంటి బాబు ఆయువు పట్టుపై కొట్టాలని ఆయన ప్రత్యర్థి.. వైసీపీ అధినేత కం సీఎం జగన్ డిసైడ్ అయినట్టు తెలిసింది. చంద్రబాబు ఎక్కడా దొరక్కుండా నిర్మించుకున్న ఆర్థిక సామ్రాజ్యాన్ని కూల్చే పనికి జగన్ శ్రీకారం చుట్టినట్టు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 21, 2020 3:22 pm
    Follow us on


    ప్రత్యర్థి చాలా బలవంతుడు.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ. చేతిలో బలమైన మీడియా ఉంది. అందుకే ఇన్నేళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చక్రం తిప్పారు. ఇప్పటికీ తిప్పుతున్నారు. ఓడినా.. గెలిచినా తనదే అప్పర్ హ్యాండ్ అని టీడీపీ అధినేత చంద్రబాబు చెలరేగిపోతుంటారు. అలాంటి బాబు ఆయువు పట్టుపై కొట్టాలని ఆయన ప్రత్యర్థి.. వైసీపీ అధినేత కం సీఎం జగన్ డిసైడ్ అయినట్టు తెలిసింది. చంద్రబాబు ఎక్కడా దొరక్కుండా నిర్మించుకున్న ఆర్థిక సామ్రాజ్యాన్ని కూల్చే పనికి జగన్ శ్రీకారం చుట్టినట్టు తెలిసింది.

    సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆర్థిక వెన్నుముకను దెబ్బతీయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్టు తెలిసింది. వైసీపీ పెద్దల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఒకే టైంలో చంద్రబాబు ఆర్థిక సామ్రాజ్యాన్ని కూల్చడానికి జగన్ రంగం సిద్దం చేస్తున్నారు.

    ఆమంచి ఆధిపత్యానికి గండికొట్టిన కరణం..!

    చంద్రబాబుకు.. లెఫ్ట్.. రైట్ లాంటి ఆర్థిక అండదండలు ఇచ్చే సుజనాచౌదరి.. సీఎం రమేశ్ లు ఇప్పుడు బీజేపీలో చేరినా వారి తెరవెనుక ఉన్నది చంద్రబాబేనంటారు. వీరే కాదు.. చంద్రబాబు పార్టీకి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా పెద్ద మద్దతుదారుగా ఉన్నారు. ఈ ముగ్గురి ఆర్థిక బలాలు దెబ్బతీసేలా జగన్ స్కెచ్ గీస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే టీడీపీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన భూమిని జగన్ ప్రభుత్వం తిరిగి తీసుకొని గల్లా ఆర్థిక సామ్రాజ్యానికి తీవ్ర హానీ తలపెట్టింది.

    ఇప్పుడు చంద్రబాబు ప్రధాన ఆదాయ వనరును దెబ్బకొట్టేలా వ్యూహం పన్నింది. దేశంలోనే శ్వేత విప్లవానికి నాందిపలికిన అమూల్ డెయిరీ ఉత్పత్తుల సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకోవడం వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ ఉందని సమాచారం.

    రాజకీయాల్లో పవన్ పై పెరిగిన ఒత్తిడి?

    చంద్రబాబు సీఎంగా ఉండగా.. ప్రభుత్వం విజయ డెయిరీని నీరుగార్చి తన హెరిటేజ్ పాల వ్యాపారాన్ని ఏపీలో విస్తరించారనే ఆరోపణలున్నాయి. హెరిటేజ్ ను వేల కోట్ల రూపాయల సంస్థగా మలచడానికి ప్రభుత్వ డెయిరీ సంస్థతోపాటు పలు ప్రైవేట్ డెయిరీ కంపెనీలను దెబ్బతీశాడంటున్నారు..

    ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏపీలోని పాడి రైతులతో కలిసి ఆమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుంటున్నారు. తద్వారా హెరిటేజ్ కు పాలుపోసే రైతులకు మంచి ధర ఇప్పించి ఆమూల్ కు పోసేలా ప్రభుత్వం సబ్సిడీలు.. ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. హెరిటేజ్ కు ప్రయోజనం చేకూర్చేందుకు సహకార రంగంలోని ఇతర డెయిరీలను చావుదెబ్బ తీసిన చంద్రబాబును హెరిటేజ్ కంటే బలమైన అమూల్ సంస్థతో కొట్టేందుకు జగన్ రెడీ అయ్యారని తెలిసింది. ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న జగన్ సంస్థ ఇక ఏపీలోని పాడి రైతుల నుంచి పాలను అమూల్ కు పోసేలా రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. తద్వారా హెరిటేజ్ సంస్థ ఆర్థిక మూలాలు దెబ్బతీసే మహా ప్లాన్ అమలు చేయబోతున్నట్టు సమాచారం.

    -ఎన్నం