https://oktelugu.com/

శభాష్ పోలీస్: ప్రాణాలు కాపాడాడిలా?

ఫ్రెండ్లీ పోలీసింగ్ కు పర్యాయపదంగా పోలీసులు నిలుస్తున్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో కఠినంగా ఉండడమే కాదు.. ఆపద వేళ సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడడం చేస్తూ అందరిచేత తెలంగాణ పోలీసులు ప్రశంసలు అందుకుంటున్నారు. తెలంగాణ పోలీసుల ధైర్యసాహసాలు దేశమంతా మారుమోగాయి. హైదరాబాద్ ఉగ్రవాదాన్ని కట్టడి చేయడం నుంచి అత్యాచారాలు, కేసులు అరికట్టడం దాకా.. తెలంగాణ పోలీసులు బాగా పనిచేస్తున్నారన్న ప్రశంసలు ఉన్నాయి. ఇక దిశ హత్యాచారంలో నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం రేపారు. తాజాగా […]

Written By:
  • NARESH
  • , Updated On : June 23, 2021 / 05:59 PM IST
    Follow us on

    ఫ్రెండ్లీ పోలీసింగ్ కు పర్యాయపదంగా పోలీసులు నిలుస్తున్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో కఠినంగా ఉండడమే కాదు.. ఆపద వేళ సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడడం చేస్తూ అందరిచేత తెలంగాణ పోలీసులు ప్రశంసలు అందుకుంటున్నారు.

    తెలంగాణ పోలీసుల ధైర్యసాహసాలు దేశమంతా మారుమోగాయి. హైదరాబాద్ ఉగ్రవాదాన్ని కట్టడి చేయడం నుంచి అత్యాచారాలు, కేసులు అరికట్టడం దాకా.. తెలంగాణ పోలీసులు బాగా పనిచేస్తున్నారన్న ప్రశంసలు ఉన్నాయి. ఇక దిశ హత్యాచారంలో నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం రేపారు.

    తాజాగా కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ద్విచక్ర వాహనం ఢీకొట్టిన వెంటనే కుప్పకూలిపోయిన యువకుడి గుండె ఆగిపోయింది. అతడి హార్ట్ బీట్ ఆగడం చూసి పక్కనే ఉన్న కానిస్టేబుల్ ఖలీల్ ప్రథమ చికిత్స చేశాడు. గుండెపైన నిమిషం పాటు పంపింగ్ చేయడంతో యువకుడి హార్ట్ బీట్ మొదలైంది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.

    ఇలా ఓ పోలీస్ డాక్టర్ గా మారి.. సమయ స్ఫూర్తితో అతడి గుండెపై ఒత్తిడి పెంచడం వల్ల ఆ యువకుడు బతికి బట్టకట్టాడు. ఈ వీడియోను తెలంగాణ స్టేట్ పోలీస్ స్వయంగా ట్వీట్ చేయడంతో వైరల్ గా మారింది. తెలంగాణ పోలీసు సమయ స్ఫూర్తికి ప్రశంసలు కురుస్తున్నాయి.