Taliban: పంజ్ షీర్ పై గెలుపు సంబరాల్లో తాలిబన్ల కాల్పులు.. చిన్నారుల మృతి

Taliban: అప్ఘనిస్తాన్(Afghanistan)లో తాలిబన్ల అరాచకం హద్దులు దాటుతోంది. గెలుపు సంబరాల్లో చేసిన కాల్పుల్లో పలువురు మరణించడం తీవ్ర విషాదం నింపింది. అమెరికా నిష్క్రమించడంతో అప్ఘన్ లో తాలిబన్లు ఆడింది ఆటపాడింది పాటగా మారింది. అప్ఘనిస్తాన్ మొత్తం ఆక్రమించిన తాలిబన్లు ఒక్క ఉత్తరాన ఉన్న పంజ్ షీర్ ను మాత్రం కైవసం చేసుకోలేదు. అక్కడ అప్ఘన్ ఉపాధ్యక్షుడు సహా కొంతమంది తిరుగుబాటు దారులు తాలిబన్లకు కొరకరాని కొయ్యగా ఉండి ఇన్నాళ్లు స్వతంత్ర్యంగా పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే పంజ్ షీర్(PanjSheer) […]

Written By: NARESH, Updated On : September 4, 2021 12:32 pm
Follow us on

Taliban: అప్ఘనిస్తాన్(Afghanistan)లో తాలిబన్ల అరాచకం హద్దులు దాటుతోంది. గెలుపు సంబరాల్లో చేసిన కాల్పుల్లో పలువురు మరణించడం తీవ్ర విషాదం నింపింది. అమెరికా నిష్క్రమించడంతో అప్ఘన్ లో తాలిబన్లు ఆడింది ఆటపాడింది పాటగా మారింది. అప్ఘనిస్తాన్ మొత్తం ఆక్రమించిన తాలిబన్లు ఒక్క ఉత్తరాన ఉన్న పంజ్ షీర్ ను మాత్రం కైవసం చేసుకోలేదు. అక్కడ అప్ఘన్ ఉపాధ్యక్షుడు సహా కొంతమంది తిరుగుబాటు దారులు తాలిబన్లకు కొరకరాని కొయ్యగా ఉండి ఇన్నాళ్లు స్వతంత్ర్యంగా పోరాడుతున్నారు.

ఈ క్రమంలోనే పంజ్ షీర్(PanjSheer) పై దండెత్తిన తాలిబన్లు అక్కడ విజయం సాధించినట్టుగా ప్రకటించుకున్నారు. పంజ్ షీర్ ను ఆక్రమించుకున్నామని తాలిబన్ ఫైటర్లు ప్రకటించడంతో శుక్రవారం అప్ఘనిస్తాన్ వ్యాప్తంగా తాలిబన్లు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే రాజధాని కాబూల్ లో తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపి పంజ్ షీర్ పై విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ కాల్పుల్లో కొంతమంది చిన్నారులు సహా పలువురు వ్యక్తులు మృతిచెందినట్టు స్థానిక అప్ఘన్ న్యూస్ ఏజెన్సీ సంచలన ప్రకటన చేసింది. సోషల్ మీడియాలో వెలుగుచూసిన కొన్ని వీడియోల్లో గాయపడిన వ్యక్తులను ఆష్పత్రికి తరలిస్తుండడం కనిపించింది. కాల్పులకు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వెలుగుచూసింది.

అయితే అప్ఘనిస్తాన్ ఉపాధ్యక్షుడు, పంజ్ షీర్ నేత అమృల్లా సలేహ్ మాత్రం ఈ వార్తలను ఖండించారు. తాలిబన్లతో పంజ్ షీర్ తిరుగుబాటు దళం ఇంకా యుద్ధం చేస్తోందని.. పంజ్ షీర్ తాలిబన్ ఆధీనంలోకి వెళ్లిందన్న వార్తల్లో నిజం లేదని అన్నారు. తాలిబన్ల దండయాత్ర కొనసాగుతోందని.. అయితే మేము ఈ నేలను పట్టుకొని పోరాడుతున్నాం అని వెల్లడించారు. అమృల్లా సలేహ్ తనయుడు ఎబదుల్లా సలేహ్ కూడా తాలిబన్ల ప్రకటనను ఖండించారు. తాలిబన్లు పంజ్ షీర్ ను జయించలేదని వెల్లడించారు. అప్ఘనిస్తాన్ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని తాలిబన్లు ఇలా చేస్తున్నారని పంజ్ షీర్ వారి వశం కాలేదని అమెరికాలో ఉన్న అప్ఘన్ జాతీయ తిరుగుబాటు దళం నేత అలీ నజరీ సైతం తెలిపారు.