
ప్రముఖ టీవీ యాంకర్, సీరియల్ నటి శాంతి(విశ్వశాంతి) అనుమానాస్పదంగా మృతిచెందడం చిత్రసీమలో కలకలం రేపుతోంది. స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఎల్లారెడ్డిగూడెం ఇంజనీర్స్ కాలనీలోని శాంతి మూడేళ్లుగా నివాసం ఉంటుంది. గడిచిన నాలుగు రోజుల నుంచి శాంతి తన గదిలోంచి బయటికి రాకపోవడం లేదు. అనుమానం వచ్చిన చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శాంతి ఇంట్లోకి వెళ్లిచూడక ఆమె శవమై కన్పించింది. దీంతో పోలీసులు ఆమె మృతిపై కేసు నమోదు చేశారు.
శాంతి ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోవడానికి ముందు ఆమె చివరగా ఎవరితోనైనా మాట్లాడారా? అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ఆమె ఇంట్లో తనిఖీలు చేసి ఆమె సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇంటి పరిసరాల్లోని సీసీ పుటేజీలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక, సెల్ ఫోన్ కాల్ రికార్డింగ్స్, సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. త్వరలో యాంకర్ శాంతి మృతి మిస్టరీని చేధిస్తామని పోలీసులు చెబుతున్నారు.