గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ ఒక మల్టీ స్టారర్ చిత్రంలో నటించ బోతున్నాడని వార్తలు వచ్చాయి . ఇపుడా వార్త నిజమని చెప్పడానికి మరో ప్రూఫ్ దొరికింది. విజయ్ సేతుపతి, మాధవన్ హీరోలుగా 2017లో `విక్రమ్ వేద` అనే మూవీ వచ్చింది. అప్పట్లో ఈ చిత్రం తమిళ్ లో ఓ ట్రెండ్ సెట్టింగ్ మూవీ అనిపించు కొంది. ఒక గ్యాంగ్ స్టర్ కి, ఒక పోలీస్ ఆఫీసర్ కి మధ్య నడిచే నైతిక యుద్ధమే విక్రమ్ వేద మూవీ. ‘ ఒక్కోసారి మంచి అనుకునేది చెడు కావచ్చు, చెడు అనుకున్నది మంచి కావచ్చు’ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శక ద్వయం పుష్కర్, గాయత్రి తెరకెక్కించారు. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని ఇప్పటికే హిందీలో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమిర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ కాంబో లో ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకి వెళ్లనుంది కూడా …
ఈ మూవీని తెలుగులో పవన్ కళ్యాణ్ కి ఆప్తుడు అయిన నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించాలని అనుకొంటున్నాడు .. ఇక ఈ చిత్రం లో రెండో హీరోగా రవితేజ నటించ బోతున్నాడు. రవితేజ తో ఇప్పటికే నేల టికెట్ , డిస్కో రాజా అనే రెండు. చిత్రాలు తీసి చేతులు కాల్చుకున్న రామ్ తాళ్లూరి ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని ఈ రీమేక్ ఎన్నుకొన్నట్టు తెలుస్తోంది. కాగా ఈ చిత్రానికి గతంలో పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల అనే రీమేక్ చిత్రాన్ని తీసిన కిశోర్ పార్ధసాని (డాలీ ) దర్శకత్వం వహించ బోతున్నాడు అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా , రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారని తెలుస్తోంది .
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Pawan kalyan to star in vikram vedha remake
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com