https://oktelugu.com/

సెంటిమెంట్: రేవంత్ రెడ్డిని భయపెడుతున్న హుజూరాబాద్

రాజకీయాల్లో సెంటిమెంట్లు ఎక్కువగా నమ్ముతుంటారు. అయితే సెంటిమెంట్లు రిపీట్ అవుతాయని అనుకోకపోయినా వాటి ప్రభావం పార్టీలపై ఉండటం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలోని హుజురాబాద్ ఉప ఎన్నికపై కూడా కాంగ్రెస్ పార్టీకి ఓ సెంటిమెంట్ ఉంది. ఇక్కడ 38 ఏళ్లుగా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిన దాఖాలు లేవు. దీంతో ఈసారి ఉప ఎన్నికలో కూడా విజయంపై నమ్మకం లేక అభ్యర్థి ఎంపికలో అంత శ్రద్ధ కనబరచడం లేదు. దీనిపై పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని పీసీసీ అధ్యక్షుడు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : August 11, 2021 / 06:03 PM IST
    Follow us on

    రాజకీయాల్లో సెంటిమెంట్లు ఎక్కువగా నమ్ముతుంటారు. అయితే సెంటిమెంట్లు రిపీట్ అవుతాయని అనుకోకపోయినా వాటి ప్రభావం పార్టీలపై ఉండటం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలోని హుజురాబాద్ ఉప ఎన్నికపై కూడా కాంగ్రెస్ పార్టీకి ఓ సెంటిమెంట్ ఉంది. ఇక్కడ 38 ఏళ్లుగా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిన దాఖాలు లేవు. దీంతో ఈసారి ఉప ఎన్నికలో కూడా విజయంపై నమ్మకం లేక అభ్యర్థి ఎంపికలో అంత శ్రద్ధ కనబరచడం లేదు. దీనిపై పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించడంతో పార్టీ వర్గాలు కూడా అంత చురుకుగా కనిపించడం లేదు.

    1983 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించిన సందర్భాలు లేవు. 1983లో స్వతంత్ర అభ్యర్థి కొత్త రాజిరెడ్డి విజయం సాధించారు. 1989లో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి కేతిరి సాయిరెడ్డి గెలిచారు. 1994, 1999 ఎన్నికల్లో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి టీడీపీ నుంచి విజయం సాధించారు. 2004 నుంచి 2018 వరకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే విజయ ఢంకా మోగించారు. 2004లో మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మికాంతరావు గెలుపొందారు. 2009 నుంచి 2018 వరకు హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలుస్తూ వస్తున్నారు.

    హుజురాబాద్ ఉప ఎన్నికలో పార్టీలు ప్రచారం ముమ్మరంగా చేస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ తరఫున గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి ఎంపిక చేయలేదు. తమ అభ్యర్థి విజయం సాధించరనే ఉద్దేశంతోనే పోటీలో లేనట్లు సమాచారం. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపోటములు పెద్దగా ప్రభావం చూపవని తెలుసుకుని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దృష్టి సారించడం లేదని తెలుస్తోంది.

    ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికలో విచిత్రమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ దళితబందు పేరుతో ఓట్లు సంపాదించాలని చూస్తోంది. బీజేపీ ప్రజాదీవెన యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహించింది. దీంతో ప్రజలను ఆకట్టుకునేందుకు పార్టీలు తమ వైఖరులను వెల్లడిస్తున్నాయి. ఓట్లు సాధించుకునే క్రమంలో పలు మార్గాలు అన్వేషిస్తున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్నాయి. అయితే రేవంత్ రెడ్డి మాత్రం హుజురాబాద్ ఉప ఎన్నికపై భయపడుతున్నట్లు తెలుస్తోంది.