Cag Report On AP Govt: కాగ్ రిపోర్టులో సంచలనాలు.. వైసీపీ ప్రభుత్వం ఇన్ని అక్రమాలకు పాల్పడిందా..?

బడ్జెట్ లో ప్రతిపాదించిన సంక్షేమ పథకాలకు (పింఛన్లు, రేషన్ ఇతర పథకాలు) 7,762 కోట్లు, కానీ వీటిని సంక్షేమం కోసం వాడలేదు, ఈ డబ్బు YSR పెన్షన్ కానుక కు వాడలేదు, రైతుల ధాన్యం ధర స్థిరీకరణ కోసం (300కోట్లు) వాడలేదు , గర్భిణీ స్త్రీల ఔషధాల కోసం (390 కోట్లు) వాడలేదు, మరి దేనికీ వాడారు?

Written By: Vicky, Updated On : July 10, 2023 8:08 am

Cag Report On AP Govt

Follow us on

Cag Report On AP Govt: ప్రభుత్వాలు ఖర్చు చేసే లెక్కలను ఆడిట్ చేసే సంస్థ ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG) అని పిలుస్తారు. ఈ సంస్థ యొక్క డ్యూటీ ఏమిటంటే, ప్రభుత్వం నిధులను ఎలా ఖర్చు చేస్తుంది?, ఎంత ఖర్చు చేస్తుంది?, ఖజానా లో మిగిలిన బ్యాలన్స్ షీట్ ఎంత ?, ఈ లెక్కలన్నీ చూసే సంస్థ అన్నమాట. ఈ సంస్థ ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న వైసీపీ ప్రభుత్వం గడిచిన ఈ నాలుగేళ్ళలో దాచిపెట్టిన లెక్కలను , అలాగే నొక్కేసిన లెక్కలను కూడా బయటపెట్టింది అంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఏలూరు ‘వారాహి విజయ యాత్ర’ సభలో చెప్పుకొచ్చాడు. ఇంతకీ CAG సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం అసలు మన రాష్ట్ర ఖజానా డబ్బులు ఏమయ్యాయో ఒకసారి చూద్దాం .

–> ఆఫ్ బడ్జెట్ బారోవింగ్ క్రింద 1.18 లక్షల కోట్లు , ఎవరికి చెప్పకుండా అప్పు చేశారు. ఈ నిధులను ఎలా ఖర్చు చేసారో ఇప్పటి వరకు లెక్కలు బయట చెప్పలేదు.

–> ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ క్రింద 22,504 కోట్ల అప్పు,స్టేట్ రోడ్ డెవలప్మెంట్ క్రింద 4,754 కోట్ల అప్పు తీసుకున్నాడు, ఇది ఎక్కడ బడ్జెట్ లో చూపించలేదు, దీనిని ఎలా ఖర్చు చేసాడో కూడా ఇప్పటి వరకు లెక్క లేదు.

–>2021-22 సంవత్సరం లో రాష్ట్ర ట్రెజరీ అనుమతి లేకుండా అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్ క్రింద 11,237 కోట్ల అప్పు చేశారు, దీనికి సంబందించిన సరైన పాత్రలు కానీ, బిల్లులు కానీ లేవు.

–> బడ్జెట్ లో ప్రతిపాదించిన సంక్షేమ పథకాలకు (పింఛన్లు, రేషన్ ఇతర పథకాలు) 7,762 కోట్లు, కానీ వీటిని సంక్షేమం కోసం వాడలేదు, ఈ డబ్బు YSR పెన్షన్ కానుక కు వాడలేదు, రైతుల ధాన్యం ధర స్థిరీకరణ కోసం (300కోట్లు) వాడలేదు , గర్భిణీ స్త్రీల ఔషధాల కోసం (390 కోట్లు) వాడలేదు, మరి దేనికీ వాడారు?

–>ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ టెరిటరీ హాస్పిటల్ కోసం కేంద్రం 250 కోట్లు ఇస్తే, ఖర్చుపెట్టక పోగా వాటిని కేంద్రానికి తిరిగి ఇవ్వలేదు, వేటికి ఖర్చుపెట్టారు అనేది చెప్పలేదు.

–> దివ్యాంగుల, స్త్రీ, శిశు సంక్షేమానికి 537.69 కోట్లు కేటాయించి, కేవలం 4% మాత్రమే ఖర్చుపెట్టారు. మిగతా డబ్బు ఏమైంది?.

ఇలాంటి అంశాల మీద పవన్ కళ్యాణ్ నేడు మాట్లాడాడు, మరి దీనికి వైసీపీ మంత్రులు మరియు నాయకులు సమాధానం చెప్తారా లేకపోతే ఎప్పటిలాగానే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పై విమర్శలు చేసి చేతులు దులుపుకుంటారా అనేది చూడాలి.