Pakistan Occupied Kashmir
Pakistan Occupied Kashmir: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో భారత్ ఆశిస్తున్నదే జరుగుతోంది. 70 ఏళ్ల పాక్ పైలనపై విసుగెత్తిన అక్కడి ప్రజలు తిరుగబాటు మొదలు పెట్టారు. ఇటీవలే ఓ ఎస్సైని చంపేశారు. మరోవైపు సైన్యంపై తిరుగుబాటు చేశారు. విద్యుత్ విషయంలో ఏళ్లుగా ఉద్యమిస్తున్నారు. రోజురోజుకూ పీవోకేలో తిరుగుబాటు ఉద్యమం పెరుగతుండడం, తాము భారత్‌లో కలుస్తామని అక్కడి ప్రజలు పేర్కొంటుండడంతో దిగివచ్చిన పాక్ సర్కార్.. కొన్ని సమస్యల పరిస్కారానికి హామీ ఇచ్చింది.
అయినా అసంతృప్తే..
అయినా పాకిస్తాన్ పాలనలో ఉండేందుకు పీవోకే ప్రజలు ఇష్టపడడం లేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఆ దేశం పూర్తిగా ఆర్థిక సంక్షోభం ఎందుక్కొంటోంది. అప్పులు పుడితే కానీ పాలన సాగించలేని పరిస్థితి. ఇక పీవోకే అనేక వనరులకు నిలయం. ఇక్కడ వనరులను పాక్ భ్రుత్వం దోపిడీ చేస్తుందన్న భావన ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి విడిపోవడమే మంచిదన్న భావనలో మెజారిటీ ప్రజలు ఉన్నారు. ఈ క్రమంలో భారత్ కూడా మళ్లీ ఎన్నికల్లో గెలిచాక పీవోకేను భారత్‌లో కలుపుతామని హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. దీంతో పీవోకే ఉద్యమకారులకు, అక్కడి ప్రజలకు మరింత బలం దొరికినట్లయింది.
భారత్‌కు మద్దతుగా ప్రమాణం..
ఈ క్రమంలో పీవోకే(బక్కర్ వాల్) భారత దేశానికి మద్దతుగా, భారత సైన్యానికి మద్దతు ఇస్తాని మే 24న(శుక్రవారం) ప్రమాణం చేసింది. తమను భారత్‌లో కలపాలని కోరింది. పాకిస్తాన్ పాలనలో ఉండలేమని ప్రకటించింది. 70 ఏళ్లుగా సాధ్యం కానిది ఇప్పుడు అప్రయత్నంగానే జరుగడం గమనార్హం.
70 ఏళ్ల తర్వాత పాక్ పరిస్థితి ఇదీ..
– 70 ఏళ్ల స్వాతంత్య్రంలో బంగ్లాదేశ్ ఇస్లామిక్ పాకిస్తాన్ నుంచి విడిపోయింది.
– ముస్లిం మెజారిటీ పీఓకే పాకిస్తాన్ నుంచి విడిపోవాలనుకుంటోంది.
– ముస్లిం మెజారిటీ బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుతోంది.
– ఆఫ్ఘనిస్తాన్ పాకిస్థాన్‌ను అసహ్యించుకుంది.
– అరబ్బులకు పాకిస్తానీలు అవసరం లేదు.
భారత్ ఇలా..
– ఇక 70 ఏళ్ల స్వాతంత్య్రంలో భారత్‌తో బంగ్లాదేశ్‌కు ఆరోగ్యకరమైన సంబంధం ఉంది.
– భారత్‌తో ఆఫ్ఘనిస్తాన్‌కు ఆరోగ్యకరమైన సంబంధం ఉంది.
– బలూచిస్తాన్ భారత్ నుంచి మద్దతు కోరుతోంది
– భారత్‌తో అరబిక్ దేశాలకు ఆరోగ్యకరమైన సంబంధాలు ఉన్నాయి.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Sensational statement of pok people in support of indian army
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com