Homeజాతీయ వార్తలుTelangana Movement: ఆమరణ దీక్షలో బాత్రూంలో కూర్చొని కేసీఆర్ ఇడ్లి తిన్నాడు.. సాక్ష్యముందట!

Telangana Movement: ఆమరణ దీక్షలో బాత్రూంలో కూర్చొని కేసీఆర్ ఇడ్లి తిన్నాడు.. సాక్ష్యముందట!

Telangana Movement: తెలంగాణను తెచ్చింది కేసీఆర్ అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఉద్యమకారులు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేపట్టి విరమించడానికి రెడీ అయితే ఆ సమయంలో తెలంగాణ విద్యార్థి శ్రీకాంతచారి పెట్రోల్ పోసుకొని నిప్పటించుకున్నాడని.. ఇక ఉస్మానియా యూనివర్సిటీ భగ్గుమన్నదని.. దీంతో కేసీఆర్ బలవంతంగా దీక్షను కొనసాగించాడని ఒక ఉద్యమకారుడు సోషల్ మీడియాలో సంచలన నిజాలు పంచుకున్నాడు.

కేసీఆర్ ను ఖమ్మం నుంచి నిమ్స్ కు తరలిస్తే ఆమరణ దీక్ష చేస్తూ బాత్రూంలో ఇడ్లీలు తిన్నాడని.. దానికి సాక్ష్యం ఉందంటూ ఓ తెలంగాణ ఉద్యమకారుడు మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాదని.. ఒత్తిడి తెచ్చి.. ఉద్యమించి తెచ్చుకుంది తెలంగాణ ప్రజానీకం అని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ కోసం కిరోసిన్ పోసుకున్న మంత్రి హరీష్ రావుకు అప్పుడు అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కోసం చాలా మంది చనిపోగా లేనిది కల్వకుంట్ల కుటుంబం నుంచి ఒక్కరు కూడా ఎందుకు చనిపోలేదని ఆయన ప్రశ్నించాడు.

మొత్తంగా కేసీఆర్ ఆమరణ దీక్ష వేళ బాత్రూంలో కూర్చొని ఇడ్లీలు తిన్నాడని.. దానికి ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయని ఒక వ్యక్తి చెప్పిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరి అందులో నిజనిజాలు ఉన్నాయా? లేక ఆరోపణాలో తెలియదు కానీ.. ఇప్పుడది మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఆయన చెప్పిన సంచలన నిజాల తాలూకా వీడియోను కింది చూడొచ్చు.


Recommended Videos
Pawan Kalyan Funny Reply to Raghu Rama Krishnam Raju | Janasena Rachabanda Chintalapudi | Ok Telugu
Exclusive interview with Telangana CPI Secretary Chada Venkat Reddy | Journalist Ranjith | Ok Telugu
దేవాలయాలు కూల్చినా రాజకీయాలా? || Analysis on Alwar Temple Demolition Clashes || RAM Talk

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version