Meena: సీనియర్ హీరోయిన్ ‘మీనా’ అంటేనే.. హోమ్లీ బ్యూటీ అని పేరు. హీరోయిన్ గా ఫామ్ లో ఉన్న సమయంలోనే మీనా ఎప్పుడు హద్దులు మీరి పరిధి దాటలేదు. కానీ ఓ వెబ్ సిరీస్ కోసం తాజాగా ఆమె ఒక బోల్డ్ క్యారెక్టర్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ వయసు అయిపోయినా.. ఇప్పటికి ఆమెలోని గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు అంటూ తమిళ డైరెక్టర్ జీవన్, ‘మీనా’ మెయిన్ లీడ్ గా ఒక సిరీస్ చేయడానికి కసరత్తులు చేస్తున్నాడు.

కానీ మధ్యలోనే ఈ సిరీస్ ఆగిపోయేలా ఉంది. తాజాగా మీనా పోస్ట్ చేసినా ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ షేర్ అవుతుంది. ఆ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు. కారణం.. ఈ వీడియోలో మీనా గర్భవతిగా కనిపించింది. పైగా మీనా ఈ వీడియోకి ఒక మెసేజ్ కూడా రాసుకొచ్చింది. ‘నేను అప్పట్లో ఈ గెటప్ వేయడం చాలా సులభంగా ఉండేది.
Also Read: Jasmine: ఆడవాళ్లు తలలో మల్లెపూలు పెట్టుకోవడానికి సైంటిఫిక్ రీజన్ ఉందా..?
దీన్ని కవర్ చేసేందుకు హెవీ చీరలు కట్టుకునేదాన్ని. కానీ ప్రస్తుతం ఈ గెటప్ కు, ఈ పాత్రకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. షిఫాన్ చీరలు కట్టుకున్నా చూడటానికి చాలా నాచురల్‌గా ఉంది’ అంటూ వీడియోకు క్యాప్షన్ గా రాసుకొచ్చింది మీనా. ఏది ఏమైనా మీనా ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ పోతుంది.

మీనాలో మునపటి నటన, ఆ పట్టుదల ఏ మాత్రం తగ్గలేదు. అవకాశం రావాలే గానీ, ఎలాంటి పాత్రలు చేయడానికైనా రెడీ అంటుంది. అందుకే మేకర్స్ కూడా మీనా ఉత్సాహాన్ని చూసి ఆమెనే మెయిన్ లీడ్ గా పెట్టి.. వెబ్ సిరీస్ లను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.
మరి బోల్డ్ సిరీస్ తో హోమ్లీ బ్యూటీ ఎంతవరకు అలరిస్తుందో అని అందరూ అనుకునేలోపే గర్భవతిగా ఉన్న ఈ వీడియోని పోస్ట్ చేసి షాక్ ఇచ్చింది. ఈ పోస్ట్‌పై చాలా మంది నెటిజన్లు ‘కంగ్రాట్స్’ అని, మరికొందరు ‘కొత్త సినిమాకు ఆల్ ది బెస్ట్’ అని కామెంట్స్ పెడుతున్నారు.
Recommended Videos:



[…] […]
[…] […]