https://oktelugu.com/

Haryana Election Results : హర్యానా ఫలితాలలో సంచలనం.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎందుకు తలకిందులయ్యాయి?

సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు పలు ఎగ్జిట్ పోల్స్ బిజెపికి జై కొట్టాయి. కేంద్రంలో మూడోసారి బిజెపి సొంతంగా అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించాయి. బిజెపి ఏకంగా 300కు పైగా పార్లమెంటు స్థానాలను గెలుచుకొని సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని వెల్లడించాయి. కానీ ఫలితాల తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని నిరూపితమైంది. అవన్నీ పల్లి బఠాణీ టైపని అవగతమైంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 8, 2024 6:29 pm
    Haryana Election Results

    Haryana Election Results

    Follow us on

    Haryana Election Results :  ఇలాంటి సన్నివేశమే హర్యానా ఎన్నికల ఫలితాలలోను చోటుచేసుకుంది. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రారంభంలో ఐపీఎల్ మ్యాచ్ మాదిరిగా కనిపించాయి.. ఫలితాల తొలి రౌండు తర్వాత పూర్తిగా ట్రెండ్స్ యూటర్న్ తీసుకున్నాయి. తీవ్ర ఉత్కంఠను కలిగించాయి. ఫలితాల వెల్లడి ప్రారంభమైన కొంత సమయానికే హర్యానాలో ట్రెండ్స్ పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. తొలి రౌండులో కాంగ్రెస్ పార్టీ ఏకంగా మ్యాజిక్ ఫిగర్ 45 ని దాటేసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయని అందరూ అనుకున్నారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని భావించారు. దీంతో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. ఈ లోగానే హర్యానా రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే చర్చ కూడా మొదలైంది.

    తలకిందులయ్యాయి

    ఇక రెండవ రౌండ్ తర్వాత ఫలితాల ట్రెండ్స్ పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీని కమలం పార్టీ పక్కకు నెట్టింది. రెడ్డి ఇచ్చిన వేగంతో దూసుకుపోయింది. కాంగ్రెస్ పార్టీని 30 స్థానాల వరకే పరిమితం చేసి.. భారతీయ జనతా పార్టీ అవలీలగా 46 మార్క్ ను దాటేసింది. అయితే ఇదే ట్రెండ్ ను బిజెపి తదుపరి రౌండ్లలోనూ కొనసాగించింది. దీంతో ఈ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఫలితాలు మొత్తం తలకిందులయ్యాయి. రాజకీయ పండితులు తలలు పట్టుకున్నారు. తొలి రౌండులో సంబరాలు జరుపుకోవడం కాంగ్రెస్ నాయకుల వంతైతే.. తదుపరి రౌండులలో బిజెపి నాయకులు కేరింతలు కొట్టారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గని ఫలితాలు సాధిస్తామని తాను ముందే చెప్పామని.. ఈ సందర్భంగా బిజెపి నాయకులు పేర్కొన్నారు. జాట్ కులస్తులలో పట్టు నిలుపుకోవడం భారతీయ జనతా పార్టీకి ఈసారి బాగా కలిసి వచ్చింది. అయితే కురుక్షేత్ర ప్రాంతంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఓట్లను భారీగా దక్కించుకుంది.

    హర్యానా ఎన్నికల్లో ఈసారి ఆప్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. పక్కనే ఉన్న పంజాబ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ.. హర్యానాలో మాత్రం తేలిపోయింది.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు భారతీయ జనతా పార్టీ గెలుపునకు దోహదం చేశాయి. వాస్తవానికి ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా ఉంటుందని సర్వే సంస్థలు వెల్లడించాయి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం అంత సులభం కాదని ప్రకటించాయి. కానీ ఎన్నికల ఫలితాలు ఇందుకు భిన్నంగా వచ్చాయి. దీంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.