Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా సిబిఐ ఎదుట హాజరయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మాత్రం ఈ రోజు సిబిఐ విచారణ ముగిశాక మనీష్ సిసోడియ ని అరెస్ట్ చేయవచ్చు అంటూ ముందుగానే జోస్యం చెప్పేశారు. క్రేజీ వాల్ కూడా వారం ముందు నుంచే విచారణ పేరుతో సిసోడియాని పిలిచి అరెస్ట్ చేస్తారు చూస్తూ ఉండండి అంటూ రోజూ ప్రకటనలు చేస్తూ వచ్చాడు. చివరికి ఈ రోజు శిశోడియా సిబిఐ ముందు హాజరయ్యి వెనక్కి వస్తాడా ? లేక అరెస్ట్ అయి జైళ్లోకి వెళతాడా ? మరి కొద్ది గంటలలో తెలిసిపోతుంది.

అయితే వారం క్రితం హైదరాబాద్ లో సోదాలు చేసిన సిబిఐ బోయినపల్లి అభిషేక్ రావు ని అరెస్ట్ చేసింది. సిబిఐ ప్రత్యేక కోర్ట్ అభిషేక్ రావు ని ఐదు రోజుల సిబిఐ కస్టడీకి అనుమతి ఇచ్చింది విచారణ కోసం. ఈ రోజుతో అభిషేక్ రావు విచారణ పూర్తయ్యాక హైదరాబాద్ కి చెందిన మరి కొంత మంది లిక్కర్ వ్యాపారస్తులను, రాజకీయ రాజకీయ నాయకులకి తమ ముందు హాజరు కమ్మని సమన్లు జారీ చేసేందుకు సిబిఐ సన్నాహాలు చేస్తోంది.
బోయినపల్లి అభిషేక్ రావు చాలా సంస్థలకి అధిపతి. అయితే వీటిలో మనం తరుచూ చూసే ప్రకటన ఒకటి ఉంది అది అనూస్.
రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ ఎల్ పీ, అగస్తీ వెంచర్స్, ఎస్ ఎస్ మైన్స్ అండ్ మినరల్స్, మాస్టర్ సాండ్ ప్రైవేట్ లిమిటెడ్ , నియో వెర్స్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్, జియూస్ నెట్వర్కింగ్ ప్రైవేట్ లిమిటెడ్, వాల్యు కేర్ ఈస్తటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్.
ఇవీ బోయినపల్లి అభిషేక్ రావు నిర్వహిస్తున్న సంస్థల వివరాలు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉందని భావిస్తున్న హైదరాబాద్ లిక్కర్ ట్రేడర్స్ తో పాటు తెలుగు రాష్ట్రాల రాజాకీయ నాయకుల పాత్ర మీద ప్రశ్నలు వేయాలని సిబిఐ భావిస్తున్నది. ఢిల్లీ తో పాటు హైదరాబాద్ లో ఢిల్లీ లిక్కర్ పాలసీ మీద మీటింగులు ఏర్పాటు చేయడం, ఢిల్లీ లిక్కర్ పాలసీ మీద కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఆపై దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మనీ లాండరింగ్ ద్వారా డబ్బుని ఢిల్లీ చేర్చినట్లు సదరు హైదరాబాద్ కి చెందిన లిక్కర్ ట్రేడర్స్ తో పాటు కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో తాజాగా సీబీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
సిబిఐ బయటకు చెప్పడం లేదు
అయితే ఐదు రోజుల బోయినపల్లి అభిషేక్ రావు విచారణ లో ఎలాంటి విషయాలు బయటపడ్డాయో సిబిఐ బయటికి చెప్పట్లేదు కానీ తాజా విచారణ కోసం హైదరాబాద్ లిక్కర్ ట్రేడర్స్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులని ప్రశ్నించాలనే నిర్ణయం వెనుక అభిషేక్ రావు ఇచ్చిన సమాచారం ఉండి ఉండవచ్చు.
అభిషేక్ రావు కంటే ముందే అరెస్ట్ అయి విచారణను ఎదుర్కొన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితులు విజయ్ నాయర్, అరుణ్ రామచంద్రన్ పిళ్లై ల స్టేట్మెంట్స్ తో అభిషేక్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ని క్రాస్ చెక్ చేసింది సిబిఐ. తరువాతనే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళను విచారణ చేయాలని నిర్ణయానికి వచ్చింది అంటే ఎక్కడో ఏదో సమాచారం అంటే బలమయిన సాక్ష్యాధారాలు దొరికినట్లే! అయితే అభిషేక్ రావు కస్టడీ తేదీ శనివారం రోజున ముగిసిపోవడం తో అతనిని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన తరువాత కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కి పంపింది అభిషేక్ రావు ని.అయితే విచారణ సందర్భంగా అభిషేక్ రావు ని సిబిఐ కొన్ని ప్రశ్నలు వేసింది
హైదరాబాద్ లోని ఒక శక్తివంతమయిన రాజకీయపార్టీ కుటుంబ ముఖ్య నేత లతో విజయ్ నాయర్, అరున్ రామచంద్రన్ పిళ్లై లని ఎవరు పరిచయం చేశారు ? వీళ్ళకి ఆ కుటుంబ ముఖ్య నేత తో ఉన్న సంబంధం ఏమిటి ? ఇద్దరూ లిక్కర్ బ్రోకర్స్ మాత్రమే కానీ రాజకీయ నాయకులు కారు కదా ? ఈ ఇద్దరికీ ఆ కుటుంబ ముఖ్య నేత తో అంత దగ్గరి సంబంధం ఎలా కుదిరింది ?
అభిషేక్ రావు ఏమో ఆ విషయం నాకు తెలియదని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. విజయ నాయర్ పిళ్లై, అరుణ్ రామచంద్రన్ పిళ్లై ల కనెక్షన్ ఆ రాజకీయ పార్టీ కుటుంబ ముఖ్య నేత ని ఎవరు కలిపారో కూడా తెలియదని వెల్లడించినట్లు సమాచారం. ఢిల్లీ ఎక్సైజ్ కమీషనర్, ఇతర ఎక్సైజ్ అధికారులని మీకు ఎవరు పరిచయం చేశారు ? అలాగే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కోసం హైదరాబాద్ లిక్కర్ ట్రేడర్స్, రాజకీయ నేతల మీటింగ్ ని ఎవరు ఆరెంజ్ చేశారు ? దేశంలోని వివిధ ప్రాంతాల నుండి హవాలా ద్వారా డబ్బుని ఎవరు పంపించారు ? ఈ ప్రశ్నలకు నాకు ఈ విషయాలు ఏవీ తెలియవని అభిషేక్ రావు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ కి చెందిన ప్రముఖ మీడియా హౌస్ యజమాని [మేనేజింగ్ డైరెక్టర్ ] ఢిల్లీ లో మీటింగులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. ఈ విషయం మీకు తెలుసా ? అని సిబిఐ అధికారులు అడగగా నాకు ఏమీ తెలియదు అని అభిషేక్ సమాధానం ఇచ్చారు. ఇవే గాక అభిషేక్ రావు ని సిబిఐ చాలా ప్రశ్నలు వేసింది. కానీ చాలా వాటికి సమాధానాలు చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. మరి కొన్ని ప్రశ్నలకి నాకు ఏమీ తెలియదు అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తున్నది .
అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా వచ్చిన సమాచారాన్ని ఇక్కడ మేము పొందుపరుస్తున్నాం. కానీ హైదరాబాద్ కి చెందిన లిక్కర్ ట్రేడర్స్, రాజకీయ నేతల కి సమన్లు ఇచ్చి విచారణకి హాజరు కావాలని అనే నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదో నర్మగర్భమయిన ఆధారం దొరికే ఉండి ఉండవచ్చు. కేసులో బలమయిన సాక్ష్యాధారాలు దొరికే వరకు ఆ ముఖ్య రాజకీయ నేతల పేర్లు బయటపెట్టకపోవచ్చు సిబిఐ ! అయితే తెలుగు పత్రికలు కొన్ని నేరుగా పేర్లతో సహా వివరంగా సమాచారం ఇవ్వడం వెనుక మర్మం ఏమిటో బోధపడడంలేదు !
ఒకవేళ అరెస్ట్ చేస్తే
ఒకవేళ ఢిల్లీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ని కనుక అరెస్ట్ చేస్తే మాత్రం ఆ ప్రభావం హైదరాబాద్ మీద కచ్చితంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రినే అరెస్ట్ చేసిన సిబిఐ మిగతా వాళ్ళ పట్ల ఉపేక్ష చూపిస్తుందా ?
అలాగే ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఒక రాజకీయ పార్టీ కుటుంబ ముఖ్య నేత ని అరెస్ట్ చేయకుండా వదులుతుందా అనే భయం రావడం సహజం !

తెర వెనుక రాజాకీయ బేరసారాలు జరిగి అది మునుగోడు ఉప ఎన్నిక మీద ప్రభావం చూపించవచ్చు కూడా. విషయం బయటికి పొక్కకుండా ఉండాలి అంటే తీవ్రంగా పోరాడినట్లుగా నటించాలి ! పోరాడాం కానీ ఓ డిపోయాం అని బయటికి చెప్పుకోవచ్చు ! ఒక అసెంబ్లీ సీటు పోయినంత మాత్రాన ఒరిగేది ఏమీలేదు అని వాదించనూ వచ్చు.
ఒక వేళ బేరం తెగితే ఫరవాలేదు కానీ తెగకపోతే ?
ఉపఎన్నికల వేళ అరెస్ట్ లు జరిగితే అది ఎదుటి పక్షం కి సానుభూతి లాభం ఉండవచ్చు. చూశారా రాజకీయంగా మేము ఎదుగుతుంటే ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం మా మీద కక్ష కట్టి అరెస్ట్లు చేస్తున్నది అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం ఆరితేరిన సంగతి తెలిసిందే ! అరెస్టులు చేయకపోతే ? అది ఇవతలి పక్షం కార్యకర్తలలో నీరుత్సాహాన్ని కలుగుచేస్తుంది. తమాషా బాగుంది కదా ?
చూద్దాం ఈ రాజకీయ డ్రామా క్లైమాక్స్ ఎలా ఉండబోతున్నదీ కొద్ది వారాలలో తెలిపోతుంది !