సీనియర్లు వర్సెస్ జూనియర్లు.. వైసీపీ, టీడీపీ గోల ఇదీ!

ఏ పార్టీలో అయినా.. పదవుల పందేరం నడుస్తూనే ఉంటుంది. అందులోనూ.. సీనియర్లు, జూనియర్లు అనే తేడా కనిపిస్తూనే ఉంటుంది. జూనియర్లకు పదవులు లభిస్తే సీనియర్లకు అలకబూనడం.. సీనియర్లకు పదవులు వస్తే జూనియర్ల వైదొలగడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి రాజకీయాలే ఏపీలో అధికార పక్షమైన వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలోనూ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏజ్‌ ఫ్యాక్టర్‌‌ తేడాతో చాలా వివాదాలు వస్తున్నాయి. Also Read: అచ్చెన్న చేతికే ఏపీ టీడీపీ పగ్గాలు, టీటీడీపీ ఎల్ రమణకే.. ఇక్కడ విచిత్రంగా.. […]

Written By: NARESH, Updated On : October 19, 2020 4:08 pm
Follow us on

ఏ పార్టీలో అయినా.. పదవుల పందేరం నడుస్తూనే ఉంటుంది. అందులోనూ.. సీనియర్లు, జూనియర్లు అనే తేడా కనిపిస్తూనే ఉంటుంది. జూనియర్లకు పదవులు లభిస్తే సీనియర్లకు అలకబూనడం.. సీనియర్లకు పదవులు వస్తే జూనియర్ల వైదొలగడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి రాజకీయాలే ఏపీలో అధికార పక్షమైన వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలోనూ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏజ్‌ ఫ్యాక్టర్‌‌ తేడాతో చాలా వివాదాలు వస్తున్నాయి.

Also Read: అచ్చెన్న చేతికే ఏపీ టీడీపీ పగ్గాలు, టీటీడీపీ ఎల్ రమణకే..

ఇక్కడ విచిత్రంగా.. వైసీపీలో సీనియర్ల, టీడీపీలో జూనియర్లు గగ్గోలు పెడుతున్నారు. తమను ఎదగనివ్వడం లేదంటూ రగిలిపోతున్నారు. దీంతో పార్టీపై ప్రభావంతోపాటు.. వ్యక్తిగ‌తంగా కూడా నాయ‌కుల‌పై ప్రభావం ప‌డుతుండ‌డంతో నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌ల ఊసు పెద్దగా క‌నిపించ‌డం లేదు. వైసీపీలో జూనియ‌ర్ల దూకుడు ఎక్కువ‌గా కనిపిస్తోంది. సుదీర్ఘ కాలంగా రాజ‌కీయాలు చేస్తున్నామ‌ని చెబుతున్నా.. ‘మేం త‌ల‌పండిన నాయ‌కుల‌మ‌ని మొత్తుకుంటున్నా..’ ఆ సీనియర్లను జూనియర్లు లెక్కచేయడం లేదట. గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట‌, గుర‌జాల‌, విజ‌య‌వాడ తూర్పు, చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరు, ఇలా యాభైకి పైగా నియోజ‌క‌వర్గాల్లో.. సీనియ‌ర్లను జూనియ‌ర్లు పట్టించుకోవడం లేదని టాక్‌.

పార్టీలో మాత్రం ఈ విషయంలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. సీనియ‌ర్లకు అవ‌స‌ర‌మైన‌ప్పుడు త‌ప్పుకుండా ప్రాధాన్యం ఇస్తామ‌ని, ఇప్పుడు రాష్ట్ర ప్రజ‌లు యువ నాయ‌క‌త్వానికి జై కొడుతున్నారని.. వారికి ప్రాధాన్యం ఇవ్వడంలో త‌ప్పులేద‌ని కొంద‌రు అంటున్నారు. మ‌రికొంద‌రు సీనియ‌ర్లను ఇలా ఒంట‌రి చేయ‌డం స‌రికాద‌ని అంటున్నారు.

Also Read: సర్కార్ వైఫల్యమైనా ఈగవాలనీయని మీడియా?

ఇక టీడీపీలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పార్టీలో యువ‌ర‌క్తం నింపుతాన‌ని వారికే 33 శాతం ప‌ద‌వులు ఇస్తాన‌ని పార్టీ అధినేత చంద్రబాబు ప్రక‌టించ‌డంతో యువ‌త ఆశ‌లు పెట్టుకుంది. ఇటీవ‌ల కొన్ని ప‌ద‌వులు ఇచ్చారు కూడా. అయిన‌ప్పటికీ.. యువ‌తకు స్వతంత్రం లేకుండా పోయింద‌ని, జూనియ‌ర్లను మాట్లాడ‌కుండా.. సీనియ‌ర్లు క‌ట్టడి చేస్తున్నార‌ని యువ నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది వార‌సులు నాయ‌కులుగా ఉన్న పార్టీ టీడీపీ అనే చెప్పాలి. వీరంతా మున్ముందు పార్టీకి ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తార‌న‌డంలోనూ ఎలాంటి సందేహం లేదు. కానీ, ఇప్పుడు వీరికి మాట్లాడేందుకు వాయిస్ లేకుండా చేస్తున్నారట సీనియ‌ర్లు. అంతేకాదు.. పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాను కూడా సీనియ‌ర్లు మేనేజ్ చేస్తున్నార‌ని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల్లో నెలకొన్న ఈ అసంతృప్తులను అధినేతలు ఎలా ఓదార్చుతారు..? ఎలా ఏకతాటిపైకి తెస్తారో..? ఆసక్తికరంగా మారింది.