https://oktelugu.com/

తిరుమలేషుడి  పింక్‌ డైమాండ్‌ కథ కంచికేనా..?

ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా.. తిరుమల పింక్‌ డైమాండ్‌పై జరిగిన రాద్ధాంతం అంతాఇంతా కాదు. ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు డైమాండ్‌ కనిపించకుండా పోయిందని.. విదేశాల్లో వేలం పాటకు వచ్చిందని చెప్పారు. టీటీడీ మాత్రం భద్రంగానే ఉందంటూ చెప్పుకొచ్చింది. ఆ అంశాన్ని అందుకున్న అప్పటి ప్రతిపక్షం..ఇప్పటి అధికారపక్ష నేతలు చంద్రబాబే కాజేశారని.. ఆయన ఇంటి కింద తవ్వాలని ఆవేశపడ్డారు. ఆ ఎపిసోడ్ అప్పుడు అలా ముగిసింది. Also Read: అచ్చెన్న చేతికే ఏపీ టీడీపీ పగ్గాలు, టీటీడీపీ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 19, 2020 / 01:36 PM IST
    Follow us on

    ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా.. తిరుమల పింక్‌ డైమాండ్‌పై జరిగిన రాద్ధాంతం అంతాఇంతా కాదు. ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు డైమాండ్‌ కనిపించకుండా పోయిందని.. విదేశాల్లో వేలం పాటకు వచ్చిందని చెప్పారు. టీటీడీ మాత్రం భద్రంగానే ఉందంటూ చెప్పుకొచ్చింది. ఆ అంశాన్ని అందుకున్న అప్పటి ప్రతిపక్షం..ఇప్పటి అధికారపక్ష నేతలు చంద్రబాబే కాజేశారని.. ఆయన ఇంటి కింద తవ్వాలని ఆవేశపడ్డారు. ఆ ఎపిసోడ్ అప్పుడు అలా ముగిసింది.

    Also Read: అచ్చెన్న చేతికే ఏపీ టీడీపీ పగ్గాలు, టీటీడీపీ ఎల్ రమణకే..

    అధికారం మారిన తర్వాత పింక్ డైమాండ్‌ల్లాంటివి ఏమీ లేవని అప్పటి ప్రతిపక్షంలో.. ఇప్పటి అధికారపక్షం వారే వాదించడం ప్రారంభించారు. కానీ.. దీన్ని ఇంతటితో వదిలి పెట్టకూడదని.. కొంత మంది డిసైడయ్యారు. ఆ పింక్ డైమండ్ సంగతి తేల్చాలని.. తిరుపతికి చెందిన న్యాయవాది ఒకరు కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు లేఖ రాశారు. అలాగే పింక్‌ డైమండ్‌ ఉందా లేదా.. జెనీవాలో వేలం వేసిన వజ్రం తిరుమల శ్రీవారిదో కాదో సీబీఐ లేదా డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ తో విచారణ జరిపించాలని ఆ న్యాయవాది కోరుతున్నారు. విదేశాలతో ముడిపడి ఉన్న వ్యవహారం కనుక కేంద్ర దర్యాప్తు సంస్థలతోనే విచారణ చేయించాలని కోరుతున్నారు. అనేక కమిటీలు.. అనేక రకాలుగా.. శ్రీవారి ఆభరణాలపై నివేదికలు ఇచ్చాయని.. ఎవరి మాట ఏమిటో అర్థం కావడం లేదన్నారు. పింక్ డైమాండ్ ఉందని..రమణదీక్షితులు ఫొటోలు కూడా చూపిస్తున్నారని ఆయన అంటున్నారు.

    అయితే.. తిరుపతి లాయర్ ఈ లేఖ రాయడం ఆసక్తిగా మారింది. తిరుమల రికార్డుల్లో అసలు పింక్‌ డైమాండ్‌ అనే పదమే లేదని కొంత మంది వాదిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిని వివాదాల్లోకి తెచ్చారని అనుమానిస్తున్నారు. రమణ దీక్షితులు అబద్ధం చెబుతుంటే ఎవరి ప్రోద్బలంతో చెబుతున్నారో కూడా తేలాల్సి ఉంది.

    Also Read: సర్కార్ వైఫల్యమైనా ఈగవాలనీయని మీడియా?

    వీటన్నింటి నేపథ్యంలో ఈ వివాదంపై ఇప్పుడు సగటు భక్తులకు కూడా అనుమానాలు మొదలయ్యాయి. అసలు తిరుమలకు సంబంధించి ఈ పింక్‌ డైమాండ్‌ ఉన్నదా..? ఉంటే ఎక్కడ పెట్టారు..? అసలు తిరుమలకు సంబంధించి ఈ డైమాండ్‌ ఎక్కడో విదేశాల్లో వేలం పాటకు రావడం ఏంటి..? దానిని అక్కడికి ఎవరు తరలించారు..? రికార్డుల్లో మాత్రం లేదంటున్న టీటీడీ మరే విషయమైనా దాస్తోందా..? రమణదీక్షితులే అబద్ధం చెబుతున్నారా..? ఈ అనుమానాలకు క్లారిటీ ఇచ్చే వారెవరు..? క్లారిటీ వచ్చేదెన్నడు..? చూడాలి మరి.