మూడు పెళ్లిళ్లు ఆ హీరోయిన్ ఎందుకు చేసుకుందంటే?

సినిమా జీవితాలంటేనే అల్లకల్లోలం.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నిలకడలేని మనస్థత్వాలు.. సరిగ్గా ఏడాది రెండేళ్లు కూడా వాళ్ల కాపురాలు నిలబడవు. ఇక హీరోయిన్ గా చేసిన వాళ్ల జీవితాలు అయితే మున్నాళ్లే ముచ్చటే. సినీ తెరపై పద్ధతిగా కాపురాలు చేసిన వారు తక్కువే. పైకి ఎంతో స్టార్లుగా వెలిగే వారి జీవితాలు మాత్రం అల్లకల్లోలంగా కనిపిస్తాయి. తెలుగు, తమిళంలో నటించిన ఒకప్పటి హీరోయిన్ రాధిక మూడు పెళ్లిళ్లు చేసుకుందని తెలుసా.. ఆమె జీవితంలో ముగ్గురు భర్తలను […]

Written By: NARESH, Updated On : July 2, 2021 2:50 pm
Follow us on

సినిమా జీవితాలంటేనే అల్లకల్లోలం.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నిలకడలేని మనస్థత్వాలు.. సరిగ్గా ఏడాది రెండేళ్లు కూడా వాళ్ల కాపురాలు నిలబడవు. ఇక హీరోయిన్ గా చేసిన వాళ్ల జీవితాలు అయితే మున్నాళ్లే ముచ్చటే. సినీ తెరపై పద్ధతిగా కాపురాలు చేసిన వారు తక్కువే. పైకి ఎంతో స్టార్లుగా వెలిగే వారి జీవితాలు మాత్రం అల్లకల్లోలంగా కనిపిస్తాయి.

తెలుగు, తమిళంలో నటించిన ఒకప్పటి హీరోయిన్ రాధిక మూడు పెళ్లిళ్లు చేసుకుందని తెలుసా.. ఆమె జీవితంలో ముగ్గురు భర్తలను మార్చేసిందన్న దానిపై ఇటీవల కొందరు ట్రోలింగ్ చేశారు. దీనిపై రాధికా స్పందించింది. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వెనుక ఎన్నో బాధలున్నాయని.. ఆ పెళ్లిళ్లు చేసుకోవడానికి అసలు కారణాలు బయటపెట్టింది.

దర్శకుడు, సహనటుడు అయిన ప్రతాప్ పోతన్ ను రాధిక మొదట 1984లో పెళ్లి చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. ప్రతాప్ పోతన్ ధనవంతుడు కావడంతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ అని అతన్ని పెళ్లి చేసుకున్నానని రాధిక తెలిపింది. అయితే ఆ తరువత పోతన్ నిజస్వరూపం బయటపడిందని పేర్కొంది. రెండు సంవత్సరాల తరువాత అతనికి విడాకులు ఇచ్చానని రాధిక తెలిపింది. ఇక రాధికే తనను మోసం చేసిందని పోతన్ అప్పట్లో కౌంటర్ ఇచ్చాడు.

ఇక ప్రతాప్ పోతన్ తో విడాకులు తీసుకున్న తరువాత బ్రిటన్ దేశస్థుడు రిచర్డ్ హార్డ్ ను రాధిక పెళ్లి చేసుకుంది. అతని వల్ల రాధిక కష్టాలు రెట్టింపయ్యాయి. ఆమె ఆస్తులన్నీ పోయి కోటిన్నర అప్పులయ్యాయని కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో తనకున్న ఒకే ఒక్క ఇల్లును కూడా అమ్మేద్దామనుకునే సరికి ఓ జ్యోతిష్యుడు వద్దని చెప్పాడు. దీంతో కొన్ని రోజుల తరువాత రాడాన్ అనే నిర్మాణ సంస్థ ను స్థాపించడంతో రాధిక కష్టాలు గట్టెక్కాయి.ఆ తర్వాత బ్రిటీష్ మొగుడిని కూడా వదిలేసింది ఈ అమ్మడు.

ఇక రాధికను తనను పెళ్లి చేసుకుంటావా అని శరత్ కుమార్ అడిగాడట.. దానికి ఆమె ముందు ఒప్పుకోలేదు. అయితే ఆ తరువాత పెళ్లి నిర్ణయాన్ని తన తల్లికే వదిలేశానని చెప్పుకొచ్చింది. రాధిక తల్లిని ఒప్పించి శరత్ కుమార్ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పడు రాధిక టీవీ సీరియళ్లలోనే కాకుండా సినిమాల్లోనూ నటిస్తోంది. అయితే తన మూడు పెళ్లిళ్ల వార్తలపై రాధిక తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చింది.